Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సింగపూర్: పని సరిగ్గా చే యలేదన్న కోపంతో పనిమనిషిపై పిడిగుద్దులతో దాడి చేసి గాయపర్చిన భారత్‌కు చెందిన 37 ఏండ్ల మహిళకు సింగపూర్ కోర్టు 16 వారాల జైలు శిక్ష విధించింది. సింగపూర్‌లోని తన ఇంటిలో పనిచేయడానికి ఒక ఏజెంట్ ద్వారా 25 ఏండ్ల భారతీయ యువతిని శర్మ అనే భారతీయుడు రప్పించారు. 2021 ఏప్రిల్ 10న లివింగ్ రూమ్‌లోని కొన్ని బొమ్మలను ఆమె శుభ్రం చేస్తుండగా శర్మ భార్య మోనికా శర్మ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మూడుసార్లు ముఖంపై పిడిగుద్దులు కురిపించింది. వాంతి చేసుకున్న పదార్ధాన్ని మొఖంపై విసిరి కొట్టింది. బాధితురాలు తన ఫొటోలను ఏజెంట్‌కు, సింగపూర్‌లోని కొందరికి పంపింది. దీంతో పోలీసులు మోనికా శర్మపై కేసు నమోదు చేశారు. కేసు విచారించిన కోర్టు ఆమెకు 16 వారాల జైలు శిక్ష విధించింది. పదివేల డాలర్లు పూచీకత్తు తో ఆమెకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తూ ఈ నెల 23 నుంచి శిక్ష అమలవుతుందని పేర్కొంది.