Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అగ్నివీర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అగ్నివీర్లకు రైల్వేలో నాన్-గెజిటెడ్ ఉద్యోగాల్లో రెండు అంచెల్లో 15% రిజర్వేషన్ లభించనుంది. దీంతోపాటు వయోపరిమితిలో సడలింపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దేహదారుఢ్య పరీక్షల నుంచి కూడా వారికి మినహాయింపు ఉంటుందట. దివ్యాంగులు (పర్సన్ విత్ బెంచ్‌మార్క్ డిజేబిలిటీ-పీడబ్ల్యూబీడీ), మాజీ సైనికులు, యాక్ట్ అప్రంటీస్ కోర్సు పూర్తి చేసినవారితో సమానంగా లెవెల్-1లో 10%, లెవెల్-2.. అంతకుమించిన నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్‌ను అగ్నివీర్లకు కల్పిస్తారు.
తొలిబ్యాచ్ వారికి ఐదేళ్లు, తర్వాతి బ్యాచ్‌ల వారికి మూడేళ్లు చొప్పున సడలింపు ఇస్తారు. నాలుగేళ్లు అగ్నివీర్లుగా ఉన్నవారికి ఈ సడలింపులు ఇవ్వాలని జనరల్ మేనేజర్లకు రైల్వేబోర్డు లేఖలు పంపింది. భర్తీ కాని ఖాళీలు ఉంటే ఇతరులతో వాటిని నింపాలని తెలిపింది. అగ్నివీర్ల కోసం రిజర్వేషన్ విధానాన్ని ఆర్పీఎఫ్ కూడా రూపొందిస్తున్నట్లు సమాచారం.