Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. అధికార బీజేపీకి కన్నడ ఓటర్లు షాకివ్వడంతో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకునే దిశగా సాగుతున్నది. హస్తం అభ్యర్థులు 117 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక అధికారాన్ని దక్కించుకోవాలంటే ప్రధానమైన మైసూరు ప్రాంతంలో కాంగ్రెస్ దూసుకుపోతున్నది. పాత మైసూరు ప్రాంతంలో మొత్తం 61 స్థానాలు ఉన్నాయి. అక్కడ 34 సీట్లలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతున్నది. దీంతో ఇప్పటివరకు జేడీఎస్‌కు కంచుకోటగా ఉన్న పాత మైసూర్లో హస్తం పార్టీ పాగావేసింది. 22 స్థానాలో జేడీఎస్ రెండో స్థానంలో ఉండగా, కేవలం 3 స్థానాలతో బీజేపీ మూడో ప్లేస్‌కు పరిమితమైంది.