Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహారాష్ట్ర: 12 ఏళ్ల బాలికకు మొదటిసారిగా రుతుక్రమం వచ్చింది. ఆ తర్వాత తన సోదరుడికి అది ఏమిటో కూడా తెలియదు. పీరియడ్స్‌లో వస్తున్న రక్తం చూసి అతనికి కోపం వచ్చింది. తన చెల్లెలు ఎవరితోనో శారీరక సంబంధం పెట్టుకుందని, అందుకే ఆమె శరీరం నుంచి రక్తం వస్తోందని ఆ కిరాతకుడు భావించాడు. దీంతో అతను ఆ చిన్నారిని బందీగా పట్టుకొని మూడు రోజుల పాటు కొట్టాడు. దెబ్బలు తాళలేక ఆ చిన్నారి చనిపోయింది. వాస్తవానికి, ఆ వ్యక్తి తన సోదరి శరీరం నుండి రక్తస్రావం కావడానికి గల కారణాన్ని అంతకుముందు తన భార్యను అడిగాడు. దీనిపై యువకుడి భార్య తనకు నిజం చెప్పకుండా యువతి సోదరుడిని మరింత రెచ్చగొట్టి ఎవరితోనైనా సంబంధం పెట్టుకుని ఉండొచ్చని చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన సోదరుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.