Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హైదరాబాద్: జేడీఎస్ ఓటమితో బీఆర్ఎస్ ఓడిపోయినట్టు అని, తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని టీపీసీసీ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయని సంచల వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని హర్షం వ్యక్తం చేశారు. జొడో యాత్ర ఫలితం కర్నాటక గెలుపుగా తీసుకెళ్లిందని రేవంత్ పేర్కొన్నారు. గాంధీ భవన్ చేరుకున్న రేవంత్ రెడ్డి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్ సమాధానం చెప్పాలని, జేడీఎస్ ఇక ఎటు వైపు ఉంటుందో అని ఎద్దేవ చేశారు. బీజేపీ తో జతకట్టమని చెప్తారా..? అని ప్రశ్నించారు. అలా అయితే.. ఆయన మైత్రి ఏంటో బయట పడుతుందన రేవంత్ పేర్కొన్నారు.