Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: సన్‌రైజర్స్‌కు కీలక పోరాటానికి సిద్ధం అయింది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా నిలవాలంటే ఈ రోజు లక్నోతో మ్యాచ్‌లో తప్పక నెగ్గాల్సిందే. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో లాస్ట్ బాల్ విక్టరీ సాధించిన హైదరాబాద్ విజయపథంలో కొనసాగాలని చూస్తోంది. హైదరాబాద్ పిచ్ ఒకసారి బ్యాటర్లకు అనుకూలించగా మరోసారి బౌలర్లకు అనుకూలంగాఉంటోంది. హైదరాబాద్ పిచ్ మీద సగటు స్కోర్ 170. అయితే ఈ సీజన్లో 5మ్యాచ్‌లు జరగగా 2 మ్యాచుల్లో 150 కంటే తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. ఈ రోజు పిచ్ మాత్రం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో మరోసారి పరుగుల పారనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్: అన్మోల్ప్రీత్, అభిషేక్, త్రిపాఠి, మార్క్రామ్, క్లాసెన్, ఫిలిప్స్, సమద్, నటరాజన్, మార్కండే, భువనేశ్వర్, ఫరూకీ.
లక్నో: మేయర్స్, డి కాక్, మన్కడ్, పాండ్యా, స్టోయినిస్, పూరన్, మిశ్రా, ఠాకూర్, బిష్ణోయ్, యుధ్వీర్, అవేష్