Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదభట్టు వేణురాజ్
నవతెలంగాణ - కంటేశ్వర్
తెలంగాణలో కూడా రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఎన్ ఎస్ యు ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబాటు వేణు రాజు అన్నారు. ఈ మేరకు శనివారం కాంగ్రెస్ భవన్ ముందు జిల్లా నగర కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు శనివారం విడుదలైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎంతో ఉత్సాహంతో విజయ సంబరాలు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షులు వేణు రాజ్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ మహేష్ సంబరాలను నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వేణు రాజు మాట్లాడుతూ.. బిజెపి అవినీతిని, అక్రమాలను, మతం పేరుతో చేసే రాజకీయ కుట్రలను పసిగట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన కర్ణాటక ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నామని ఆయన అన్నారు.గత తొమ్మిది సంవత్సరాలుగా బీజేపీ ప్రజలను మోసం చేస్తుందని ,ప్రతి వస్తువులపై జిఎస్టి పెంచి సామాన్యుల జీవితాలను భారం చేసిందని ,మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్న బిజెపి యొక్క దుర్బుద్ధిని ప్రజలు గమనించి ,దేశం బాగుపడాలంటే కావాల్సింది అభివృద్ధి అని మతం పేరుతో చేసే చిల్లర రాజకీయాల వల్ల రాష్ట్ర ప్రజలకు గాని దేశానికి గాని ఎలాంటి ప్రయోజనాలు ఉండవని భావించి కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి ఓటేశారని ఆయన అన్నారు.రాజస్థాన్లో ,చత్తీస్గడ్ లో ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించారని ,ఇది దేశ అభివృద్ధికి మొదటి అడుగని ,కర్ణాటకలో కాంగ్రెస్ విజయమనేది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మొదటి అడుగు ,రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ భారి మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్ మాట్లాడుతూ మొన్న రాజస్థాన్, చత్తీస్ ఘడ్ ,నేడు కర్ణాటక ,రేపు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ,కాంగ్రెస్ పార్టీ నాయకులు మరింత కష్టపడి తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని, రానున్న రోజుల్లో బిజెపి రహిత దేశంగా భారతదేశాన్ని రూపొందిస్తామని ,దేశమంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పిసిసి సంయుక్త కార్యదర్శి వేణుగోపాల్ యాదవ్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు రాజ నరేంద్ర గౌడ్, నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతం, మాజీ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ ,నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్ ,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, విజయ్ పాల్ రెడ్డి , ఎన్ ఎస్ యు ఐ నాయకులు నిఖిల్ రెడ్డి సయ్యద్ అష్రాఫ్, శివ, సందీప్ రెడ్డి , అభిలాష్ రెడ్డి,జిందమ్ రథన్, ఇంజెమామ అహ్మద్, ఆర్య, రవితేజ, అనిల్, ప్రశాంత్, రాజేందర్, సాయిబాబా, అష్రఫ్,సునీల్, లక్ష్మణ్ ,సాయిలు ,వినోద్ ,రూపేష్ ,కైసర్,ముష్షు పటేల్, నిఖిల్, శివ తదితరులు పాల్గొన్నారు.