Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
జింబాబ్వే క్రికెట్ మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆ దేశ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు జింబాబ్వే మాజీ విద్యా, క్రీడ, సంస్కృతి శాఖ మంత్రి డేవిడ్ కోల్టార్ట్ ట్విట్టర్లో దీనిని పంచుకున్నారు. స్ట్రీక్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని దేశ ప్రజలను కోరారు. మన దేశం ఇప్పటి వరకు సృష్టించిన గొప్ప క్రికెటర్లలో ఒకరైన హీత్ స్ట్రీక్ చాలా అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఇప్పుడు ఆయన త్వరగా కోలుకోవాలని మనమంతా ప్రార్థనలు చేయాలని, దయచేసి అందరం కూడా అతని కోసం, అతని కుటుంబం కోసం ప్రార్థిద్దామని పోస్ట్ చేశాడు.
1993లో తన అంతర్జాతీయ కెరీర్ను ప్రారంభించిన స్ట్రీక్ 65 టెస్టులు, 189 వన్డేలు ఆడాడు. అతని 2005లో చివరి మ్యాచ్ ఆడాడు. 21 టెస్టులు, 68 వన్డేలకు కెప్టెన్గా వ్యవహరించాడు. అవినీతికి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అతనిపై ఎనిమిదేళ్ల నిషేధాన్ని విధించింది. ఈ అంశానికి సంబంధించి అతను క్షమాపణలు చెప్పాడు. అయితే ఎలాంటి ఫిక్సింగ్ లకు తాను పాల్పడలేదని స్పష్టతను ఇచ్చాడు.