Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో సుప్రసిద్ధ ఆలయాల్లో పేరుగాంచిన కోవెల భద్రాచలం శ్రీ సీతారాముల వారి దేవాలయం. దేశంలోని రాముల వారి ఆలయాల్లో ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే యోచనలో ఉంది. మరోవైపు ఈ ఆలయ అభివృద్ధికి దాతలు కూడా ముందుకు వస్తున్నారు. తాజాగా భ ద్రాచలం సీతారాములవారికి ప్రముఖ సినీ హీరో ప్రభాస్ రూ.10 లక్షల విరాళం పంపారు. ఆయన ప్రతినిధులు దంతులూరి సత్యనారాయణరాజు, వేమారెడ్డి, విక్రమ్, శ్రీనివాసరెడ్డి శనివారం ఆలయ ఈవో రమాదేవికి చెక్కును అందించారు. ఈ మొత్తాన్ని అన్నదానం, గోశాల విస్తరణ, ఆలయ అవసరాల నిమిత్తం కేటాయించినట్లు ఏఈవో భవాని రామకృష్ణారావు తెలిపారు. రామాయణం ఇతివృత్తంతో ప్రభాస్ శ్రీరాముడిగా నటింటిన ఆదిపురుష్ చిత్రం విజయవంతం కావాలని ప్రతినిధులు ప్రధానాలయంలో మూలవిరాట్‌కు, అనుబంధ ఆలయాల్లో ఆంజనేయుడికి, లక్ష్మీతాయారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు