Authorization
Fri April 04, 2025 09:50:15 am
నవతెలంగాణ - మహారాష్ట్: పాల్ఘర్లోని ఓసర్ వీరా గ్రామానికి చెందిన సోనాలి వాఘాట్ అనే గర్భిణీ జనరల్ చెకప్ కోసం దండల్వాడి పీహెచ్‌సీకి బయల్దేరింది. ఆమె గ్రామం నుంచి 3.5 కిలోమీటర్లు నడిచి హైవేకు చేరుకుని, అక్కడి నుంచి ఆమె ఆటోలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. వైద్య చేయించుకున్న తర్వాత తిరిగి ఇంటికి ఆటోలో బయలు దేరిచి వచ్చింది. ఈ క్రమంలో హైవేపై దిగింది. అప్పటికే ఎండ తీవ్రంగా ఉండటంతో మెల్లగా కాలి నడకన నడుచుకుంటూ ఆమె ఇంటికి చేరుకుంది. అయితే ఇంటికి చేరుకున్న కాసేపటికే వడదెబ్బ వల్ల సోనాలి వాఘాట్ తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం సబ్ డివిజనల్ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే సోనాలి వాఘాట్ మరణించింది. ఆమె కడుపులో ఉన్న గర్భస్థ శిశువు కూడా ప్రాణాలను కోల్పోయింది. భగభగమండే ఎండలో 7 కిలో మీటర్ల దూరం నడవడం వల్ల ఆమె వడదెబ్బకు గురైందని, బాధితురాలికి రక్త హీనత వ్యాధి కూడా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో ఆమె మృతదేహన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.