Authorization
Fri April 04, 2025 06:47:29 am
నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలో డెంగ్యూ నివారణ కోసం వైద్య సిబ్బంది పట్టణంలో గల చౌరస్తా వద్ద వరకు ర్యాలీ నిర్వహించారు. డెంగ్యూ నివారణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలను వైద్య సిబ్బంది నినాదాల ద్వారా వివరించారు. ప్రతి ఒక్కరూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల నివారణ కోసం తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి హేమీమా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.