Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వనపర్తి రూరల్ : అంతర్రాష్ట్ర మేకల దొంగల ముఠాను చిన్నంబావి వనపర్తి ఎక్స్ రోడ్ చిన్నంబావి వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఆరుగురు నిందితులను పట్టుకుని వారి దగ్గర నుంచి లక్ష రూపాయల నగదును స్వాధీన పరచుకున్నట్లు ఎస్సై ,సీసీఎస్ సీ ఐ శ్రీనివాసచారి బృందం తెలిపారు. ఫిర్యాదుదారుడు శ్రీనివాసులు తండ్రి చంద్రయ్య (20 ) పెద్దదగడ గ్రామానికి చెందిన ఇతను తన దగ్గర 15 మేకలు ఉన్నాయని మేకలను ప్రతిరోజు మేపడానికి అడవికి వెళ్లి ఇంటిదగ్గర కట్టేసేవాడినని ఆ ప్రాంతం బస్టాండ్ దగ్గరలో ఉందని మేకల రాత్రి కట్టేసానని ఉదయం చూస్తే మేకలు లేవని అదేవిధంగా కొత్తకోట మండలం విలయం తండా కు చెందిన రాత్లావత్ గోపాల్ నాయక్ తండ్రి బోధయ్య(60) అతని 30 మేకలు పోయాయని వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగిందని తెలిపారు. నిందితులు ఎరుకలి ఆంజనేయులు తండ్రి వీరన్న, నాసరి కులయప్ప తండ్రి సుంకన్న, మన పాటిసూరి అలియాస్ సౌదయ, ఉలువల రాఘవేందర్ తండ్రి వెంకటస్వామి, గుజ్జుల రమేష్ తండ్రి పుల్లన్నలను పట్టుకున్నట్లు తెలిపారు. కరుణాకర్, ఎం శ్రీను పరారీలో ఉన్నారని తెలిపారు.