Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆత్మకూరు : పొట్టి శ్రీరాములు అడుగుజాడల్లో నడవాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు.గురువారం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం వాసవీ,అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాల యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పొట్టిశ్రీరాములు మహాత్మాగాంధీ అడుగు జాడల్లో నడిచి దేశం కోసం పోరాడి అమరజీవిగా నిలిచారన్నారు. ఆర్యవైశ్యులు ఆయన అడుగు జాడల్లో నడవాలనిఆకాంక్షించారు. ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉండి అందరికీ ఆదర్శంగా నిలువాలన్నారు. అనంతరం అనాథలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవీ క్లబ్ రీజియన్ చైర్మన్ , వనపర్తి ఆర్యవైశ్య యువజన సంఘం జిల్లాఅధ్యక్షులు రాముని నీలేష్, ఆర్యవైశ్య సం ఘం అధ్యక్షులువంగా బాలకృష్ణ, వాసవీ క్లబ్ అధ్యక్షులు సూరం పల్లి నవీన్, మండల అధ్యక్షుడుకట్టచంద్రశేఖర్, ఆవోపాఉపాధ్యక్షులు ప్రవీణ్ పాల్గొన్నారు.