Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నంగునూరు
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధి దారులు సద్వినియోగం చేసు కోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపు నిచ్చారు. నంగునూరు మండలం సిద్దన్నపేట, ఖాతా గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచ్ ల అధ్యక్షతన బుధవారం పెరటి కోళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గత డిసెంబర్ నెలలో చెల్లించిన 140 మంది లబ్ధిదారులకు కోడి పిల్లలను అందించారు.ఒక యూనిట్ కు రూ.1850 గాను సబ్సిడీ రూ.1250 పోను లబ్ధిదారులు కేవలం రూ.600 చెల్లిస్తే 25 కోడి పిల్లలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్య క్రమంలో గ్రామ సర్పంచ్ చల్ల దశమంత రెడ్డి, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి ఎంపీటీసీ బెదురు తిరుపతి, సోసైటీ చైర్మన్ కోల రమేశ్ గౌడ్, పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జగత్ కుమార్ రెడ్డి, పశువైద్యాధికారి వేణుగోపాల్, సిబ్బంది పాషా,నరేష్, బాలరాజు,మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.