Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాములు గౌడ్
నవతెలంగాణ- గజ్వేల్
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలకవర్గం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తుందని గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్ అన్నారు. బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం తీర్మానం కోసం వారం రోజుల క్రితం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందించినట్లు ఆయన గుర్తు చేశారు. పార్టీ అధిష్టానం, ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మున్సిపల్ ప్రజలను ఇబ్బందుల్లో నెట్టినట్లు అనిపిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం లో మున్సిపల్ పాలకవర్గం నెలకొన్న ముసలమును పరిష్కరించడంలో పార్టీ అధిష్టానం పూర్తిగా విప్లమైందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు అవిశ్వాసం విషయంలో ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్, రోడ్లు మురికి కాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్న వాటిని పట్టించుకోని పాలకవర్గం ఇప్పుడు అవిశ్వాసం పేరుతో డ్రామాలాడుతుందన్నారు. మున్సిపల్ పాలకవర్గాన్ని రద్దు చేస్తారా, లేదా స్పెషల్ అధికారి నియమిస్తారా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకొని ప్రజలకు సేవలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.