Authorization
Sun April 06, 2025 11:32:40 am
నవతెలంగాణ-మద్దూరు
రైతు కుటుంబాలకు రైతుబీమా పథకం ఒక వరమని సర్పంచ్ బద్దిపడగ లలిత కృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని నర్సాయపల్లి గ్రామంలో ఈ నెల 1న ముస్త్యాల రాములు రైతు మృతి చెందడంతో ఆ రైతు సంబంధించి రైతుబీమా పథకంలో భాగంగా నామినీ వివరాలను వ్యవసాయ శాఖ ఏఈఓ రాకేష్తో కలిసి వివరాలను సేకరించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ చింతల ఎల్లయ్య, వార్డు సభ్యులు తలారి సరిత, ముస్తాల శ్రీనివాస్, చేర్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ శనిగరం సత్యనారాయణ కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ బాదల్, గ్రామ శాఖ అధ్యక్షులు తౌటి యాదగిరి, మాజీ ఎంపీటీసీ దేవరాజుల చంద్రయ్య, నాయకులు మంకెన బాల్ రెడ్డి, మంతెన శ్రీపతి రెడ్డి, బద్ధిపడిగ రాంమోహన్ రెడ్డి, తలారి కనకయ్య, ముస్త్యాల ఎలీషా, గ్రామ కార్యదర్శి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.