Authorization
Fri May 02, 2025 01:34:02 am
నవతెలంగాణ-మొయినాబాద్
మండలంలో కరోనా కేసులు విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని నాయకులు బస్వపురం అంజయ్య గౌడ్ అన్నారు.శుక్రవారం మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి గ్రామంలోని లబ్దిదారులకు కరోనా నిబంధనలు పాటిస్తూ, పింఛన్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి,భౌతిక దూరం పాటించి,చేతులు ఎప్పటికప్పుడు శానిటైజర్ రుద్దుకోవాలని సూచించారు.కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.