Authorization
Fri May 02, 2025 01:18:55 am
నవతెలంగాణ-షాద్నగర్ రూరల్
షాద్నగర్ పట్టణంలోని శివ మారుతి దేవాలయంలో సంకటహర చతుర్దశిని పురస్కరించుకుని మహాగణపతికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో దేవాలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. సంకటహర చతుర్థి ప్రతి నెల కష్ణపక్షంలో నాలుగవ రోజు వచ్చే చవితి అని, ఆ సమయంలో గణపతిని ఆరాధిస్తే కష్టాలు తొలిగిపోతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వినాయక సేవా సమితి అధ్యక్షులు శ్రీకాంత్, రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి గందే సురేష్, సామాజిక వేత్త నీల రవీందర్, సాయి ప్రింటింగ్ ప్రెస్ గడ్డం అంజనేయులు , టైలర్ కైలాష్ నాథ్, పట్నం సంతోష్ కుమార్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.