Authorization
Fri May 02, 2025 01:55:20 am
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మైత్రినగర్ వద్ద స్వామి వివేకానంద వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివేకానంద సేవ సమితి గౌరవ అధ్యక్షులు జ్ఞానేంద్ర ప్రసాద్‌తో పాటు సీనియర్ నాయకులు రవి కుమార్ యాదవ్, బీజేపీ నాయకులు కలసి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివేకానందుడు గొప్ప మేధావి అని తెలిపారు. అత్యున్నత వ్యక్తిత్వ నైపుణ్యాలున్న అతన్ని భారతదేశపు ఎత్తైన ఆధ్యాత్మిక నాయకులలో ఒకరిగా చేశారని అన్నారు. స్వామి వేదాంత తత్వాన్ని పాశ్చాత్య ప్రపంచానికి తీసుకువెళ్ళాడని, భారతీయ సంస్కతి, నాగరికతను అత్యంత ప్రభావవంతమైన రాయబారుల్లో ఒకరి పేర్కొన్నారు. సామాజిక సంస్కరణ వివేకానంద ఆలోచనలలో ఒక ప్రముఖ అంశమన్నారు. భారత యువత స్వామి వివేకానంద బోధలను చదవాలని, సమీకరించాలి, పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మణిక్ రావు, ఎల్లేశ్, లక్ష్మణ్, విజేందర్, వినోద్, గణేష్, శ్రీనివాస్ యాదవ్, పథ్వీ కాంత్, ప్రభాకర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.