Authorization
Sat May 03, 2025 09:20:41 am
నవతెలంగాణ-మర్పల్లి
మండలంలోని గ్రామాల్లో ప్రభుత్వ అభివద్ధి పనులతో పాటు, వంద శాతం పన్నులు వసూలు చేయాల్సిందేనని ఎంపీడీవో వెంకట్ రామ్ గౌడ్ అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో కార్యదర్శులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో పెండింగ్లో ఉన్న శ్మశానవాటిక నిర్మాణ పనులు వారంలోగా పూర్తిచేసి, ఇంటి పన్నులు తప్పనిసరిగా వసూల్ చేయాలన్నారు. గ్రామాల అభివద్ధిలో కార్యదర్శులది కీలకపాత్ర అన్నారు. పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవన్నారు. పలువురు కార్యదర్శుల పనితీరును అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సోమలింగం, గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు.