Authorization
Wed April 30, 2025 04:22:51 pm
- డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి
నవతెలంగాణ-పరిగి
స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగొచ్చని డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగి పట్టణ కేంద్రం హైదరాబాద్ రోడ్డులో జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ షోయబ్ నిజాంస్ రీడ్జ్ సిమెంట్ వర్క్, డిజిటల్ సర్వీస్‌ను మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం ఉపాధి అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని అన్నారు. స్వయం ఉపాధి ద్వారా వారు ఉపాధి పొందడమే కాకుండా ఇతరులకు కూడా ఉపాధి కల్పించొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, పట్టణ అద్యక్షులు కృష్ణ, జిల్లా కో-ఆప్షన్ మాజీ మెంబెర్ మీర్ మహమూద్, మత్స్యకార సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు, యువజన కాంగ్రెస్ నాయకులు జగన్, పట్టణ వైస్ ప్రెసిడెంట్ ఏజస్, రామకృష్ణారెడ్డి, ఆయుబ్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.