Authorization
Fri May 02, 2025 02:43:50 pm
ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
ప్రభుత్వాస్పత్రిలో ఐసీయూ ప్రారంభోత్సవం
నవతెలంగాణ-ఫరూఖ్ నగర్
ఆరోగ్య తెలంగాణనే టీఆర్ఎస్ లక్ష్యమనీ, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ఆంజయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం షాద్నగర్ ప్రభుత్వాస్పత్రిలో రూ.40 లక్షలతో ఐసీయూ ఎమెర్జెన్సీ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆస్పత్రులలో సదుపాయాలు కల్పిస్తున్నారన్నారు.ప్రజలకు మౌలిక సదుపాయాలు విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. విద్యా ప్రమాణాలు పెంచ డం కోసం ప్రభు త్వం రాష్ట్ర వ్యాప్తంగా రూ.7 కోట్లు మంజూరు చేసిందని వివరించారు. అదేవిధంగా కోట్లాది రూపాయలు వెచ్చించి నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం కోసం 100 పడకల ఆస్పత్రిని ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మెన్ నరేందర్, వైస్ చైర్మెన్ నటరాజన్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్, జడ్పీటీసీ వెంకట్రామ్రెడ్డి పాల్గొన్నారు.