Authorization
Thu May 01, 2025 05:15:08 am
నవతెలంగాణ-అడిక్మెట్
వారసత్వ కళల రక్షణ, ప్రోత్సాహం కోసం 'హునర్ హాట్' కార్యక్రమం చేపడుతున్నామని కేంద్ర సాంస్కృతిక పర్యాటకశాఖ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. ఆదివారం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 37వ హస్తకళా ప్రదర్శన (హునర్ హాట్) ను రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి ప్రారం భించారు. సందర్భంగా కేంద్ర మంత్రులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేతి వృత్తులు, కళాకారుల స్వదేశీ వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు 'మిషన్ మోడ్'పై కృషి చేయడం ప్రారంభించిందన్నారు. దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులను ప్రదర్శించడం ద్వారా హస్త కళాకారుల ఆదాయం మెరుగుపడు తుందన్నారు. 'హునర్ హాట్' కార్యక్రమం వల్ల వారసత్వ కళలు పునరుజ్జీవింప చేసుకు నేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. గత ఏడేండ్లలో సుమారు 8 లక్షల మంది కళాకారుల తోపాటు చేతివృత్తుల వారికి ఉపాధి, ఉపాధి అవకాశాలను అందించిందని తెలిపారు.