Authorization
Wed April 30, 2025 11:23:17 pm
నవతెలంగాణ-ఆమనగల్
తలకొండపల్లి మండలం చెన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లప్పగుట్టపై కొలువై ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి ఆమనగల్ మండల పరిషత్ ఉపాధ్యక్షులు జక్కు అనంత్‌రెడ్డి తన వంతు విరాళంగా రూ.11,116లు ప్రకటించారు. ఆదివారం ఆమనగల్ పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చేతులమీదుగా చెన్నారం సర్పంచ్ స్వప్నభాస్కర్రెడ్డికి వైస్ ఎంపీపీ జక్కు అనంత్ రెడ్డి నగదు విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నేనావత్ అనురాధపత్యనాయక్, ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మెన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మెన్ తోట గిరియాదవ్, ఎంపీటీసీ కుమార్, కౌన్సిలర్లు సోనాజైరామ్ నాయక్, రాధమ్మ వెంకటయ్య, ఏఎంసీ డైరెక్టర్ రమేష్ నాయక్, నాయకులు సయ్యద్ ఖలీల్, చుక్క నిరంజన్‌గౌడ్, రమేష్, రమేష్‌నాయక్, తదితరులు పాల్గొన్నారు.