Authorization
Wed April 30, 2025 11:45:47 am
- కల్వకుర్తి బీజేపీ ఇన్చార్జి గోరటి నర్సింహ
నవతెలంగాణ-ఆమనగల్
శంకుస్థాపనలతో కాలయాపన చేయకుండా కళాశాల భవనం నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కల్వకుర్తి నియోజకవర్గం బీజేపీ ఇన్చారి ్జ గోరటి నర్సింహ అన్నారు. ఆదివారం ఆమనగల్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక నాయకులతో కలిసి గోరటి నర్సింహ మాట్లాడారు. గతంలో కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ద్వారా అప్పటి ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి ఆధ్వర్యంలో కళాశాల భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయంతో పాటు భవనం నిర్మాణానికి ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మళ్ళీ అదే భవనానికి ఈనెల 14న శంకుస్థాపన చేయడానికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఏర్పాట్లు చేయడం దివంగత నేతలు సూదిని జైపాల్ రెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి లను అవమాన పరచడంతో సమానమన్నారు. ఇన్ని సంవత్సరాలుగా కళాశాల భవనం నిర్మాణం పూర్తి కాకపోవడం ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని నర్సింహ ఆరోపించారు. ఇప్పటికైన శంకుస్థాపన తదిథర కార్యక్రమాలతో కాలయాపన చేయకుండా జూనియర్ కళాశాల భవనం నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేయాలని ఆయన పేర్కొన్నారు. ఈసమావేశంలో ఆమనగల్ మున్సిపల్ చైర్మన్ నేనావత్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ భీమనపల్లి దుర్గయ్య, బీజేపీ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ చెక్కల లక్ష్మణ్, కష్ణయ్య యాదవ్, నాయకులు శ్రీశైలం, రవి రాథోడ్, యాదగిరి, మల్లేష్, శివ తదితరులు పాల్గొన్నారు.