Authorization
Sat May 03, 2025 12:05:34 am
- ప్రధానోపాధ్యాయులు గోపాల్
నవతెలంగాణ - బొంరాస్పేట్
ఏకరూప దుస్తులు ధరించడంతో పాఠశాలలో విద్యార్థులు భిన్నత్వంలో ఏకత్వంలా ఉంటారని బాపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాల్ అన్నారు. సోమవారం ప్రభుత్వ బడులల్లో చదువుతున్న ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనార్టీ విద్యార్థులకు ఉచిత దుస్తుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బాపల్లి తండాలో 30 నుంచి 45 మంది బాలబాలికలకు పంపిణీ చేశారు.