Authorization
Thu May 01, 2025 12:53:35 am
-గున్గల్ మోడల్ స్కూల్ విద్యార్థి
నవతెలంగాణ-యాచారం
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో యాచారం మండలం గున్ గల్ మోడల్ స్కూల్ విద్యార్థి దేశవ్యాప్తంగా 471 ర్యాంకు సాధించి సత్తా చాటాడు. మండల పరిధిలోని తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన రమావత్ ప్రవీణ్ జేఈఈ ఫలితాల్లో ర్యాంకు సాధించడం అభినందించాల్సిన విషయమని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ హేమీమా బుధవారం ప్రకటనలో తెలిపారు. చదువుకు పేదరికం అడ్డు కాదని చదవాలనే మనస్తత్వం ఉంటే ఏ స్థాయి కన్నా ఎదుగువచ్చని తెలిపారు. అతను ఈ ర్యాంకు సాధించడం మోడల్ పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థులంతా చిన్నతనం నుంచే కష్టపడి చదివే తత్వం అలవర్చుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ను అభినందించారు.