Authorization
Thu May 01, 2025 04:39:41 am
- ఎంఐఎం కొడంగల్ నియోజకవర్గ అధ్యక్షులు ఎస్బి గుల్షన్
నవతెలంగాణ-కొడంగల్
పెట్రోల్, డీజిల్ బంకుల్లో వాహనదారులకు పెట్రోల్ బంక్ నిర్వాహకులు లీటరు పెట్రోలు వేయిం చుకుంటే దానికి తక్కువగానే వేస్తూ వాహనదారులను మోసం చేస్తున్నారని ఎంఐఎం కొడంగల్ నియోజకవర్గ అధ్యక్షులు ఎస్బి గుల్షన్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతుంటే, మరోవైపు బంకు నిర్వాహకుల జమ్మికులతో వాహనదారులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజక వర్గంలోని అన్ని పెట్రోల్ బంకులలో భారీ తేడాలతో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారని అన్నారు. వాహనదారులను మోసం చేస్తున్న సంబంధిత అధికారులు మాత్రం స్పందించకపోవడం సరైంది కాదన్నారు.