Authorization
Thu May 01, 2025 12:35:24 pm
- టీఎస్‌యూటీఎఫ్ మండల అధ్యక్షులు ఎండి అజ్మతఖాన్, కందుకూరు మండల ప్రధాన కార్యదర్శి డాక్టర్ బగ్గ రాములు
నవతెలంగాణ-మంచాల
తెలంగాణ రాష్ట్రంలోని మహాత్మా జ్యోతి రావు పూలే బీసీ గురుకుల పాఠశాలల పని వేళలు ఉదయం 9.00గంటల నుంచి సాయంత్రం 4.30 నిమిషాల వరకు నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని టీఎస్‌యూటీఎఫ్ మండల అధ్యక్షులు ఎండి అజ్మతఖాన్, కందుకూరు మండల ప్రధాన కార్యదర్శి డాక్టర్ బగ్గ రాములు కోరారు. ఆదివారం ఎమ్మెల్సీ అలగుబెల్లి నర్సిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా జ్యోతి రావు పూలే బీసీ గురుకుల పాఠశాలల ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 4.30 నిమిషాల వరకు ఉండడం వలన ఉపాధ్యాయులకు ఇబ్బంది అవుతుందన్నారు. పని వేళలు తగ్గించే విధంగా చొరవ చూపాలని కోరారు.