Authorization
Thu May 01, 2025 07:39:52 pm
నవతెలంగాణ-చేవెళ్ల
భగత్‌సింగ్ నినాదం ఇంక్విలాబ్ జిందాబాద్ నేటికీ సామాన్యులు స్వప్నంగా ఉందని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి అన్నారు. బుధవారం భగత్ సింగ్ జయంతి సందర్భంగా చేేవెళ్లలో భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాలవేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చేవెళ్ల మండల కేంద్రంలో కుంచం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అనంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ అల్లాడ శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల మండల దళిత మోర్చా అధ్యక్షులు అర్రపల్లి అశోక్, బీజేవైఎం టౌన్ ప్రెసిడెంట్ బండారి శేఖర్ రెడ్డి, మండల ఐటీ సెల్ కన్వీనర్ అభిషేక్ రెడ్డి, భగత్ సింగ్ నగర్ కాలనీవాసులు పాల్గొన్నారు.