Authorization
Mon May 05, 2025 09:57:19 pm
నవతెలంగాణ-దోమ
మండల పరిధిలోని ఊటుపల్లి ప్రభుత్వ పాఠశా లలో అక్టోబర్ 23 ధన్వంతరి జయంతి సందర్భంగా శుక్రవారం ఉచిత స్కూల్ హెల్త్ కార్యక్రమాన్ని ఏర్పా టు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ఆయుష్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పా టు చేసినట్టు దోమ మండల ఆయుర్వేద వైధ్యాధికారి గాయత్రి అన్నారు. ప్రభుత్వ బడులలో విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్య పరమైన సమస్యలు ఉంటే వాటి నివారణకు అవసరమైన ఆయుర్వేద మందులను పంపిణీ చేసి తగిన సలహాలు సూచనలు అందించాస్తామన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానా చార్యులు ఎల్లయ్య, ఉపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి, ఇలి యాస్, మనోరమ, రూహిన బేగం, వైద్య సిబ్బంది వెం కటేశ్వర్లు, వనజ పాల్గొన్నారు.