Authorization
Wed April 30, 2025 09:45:51 am
నవతెలంగాణ-తలకొండపల్లి
తలకొండపల్లి మండల కేంద్రంలోని నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీకి భారత రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేయనున్నట్టు సర్పంచ్ లలిత జ్యోతయ్య తెలిపారు. గురురవారం గ్రామపంచాయతీ సమీపంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సర్పంచ్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు నూతనంగా నామకరణం చేసినట్టు చెప్పారు. సుమారు 40 లక్షల రూపా యలతో నిర్మించిన అంబేద్కర్ భవనం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి, నీటి సరఫరా శాఖల మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, , కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నాగర్ కర్నూల్ జిల్లా పోతుగంటి ఎంపీ రాములు, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితరెడ్డి, మాజీ ఎంపీ మంధా జగన్నాథం, తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్ , వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, హాజరవుతున్నారని తెలిపారు. లంలోని వివిధ గ్రామాల ప్రజలు సర్పంచులు, ఎంపీటీసీలు పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.