Authorization
Tue April 29, 2025 02:16:34 am
నవతెలంగాణ-శంకర్పల్లి
గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని గోపులారం గ్రామ సర్పంచ్ పొడవు శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరగా, ఆయన సానుకూంగా స్పందించినట్టు తెలిపారు. ఆయనతోపాటు గోపులారం మహాలింగాపురం గోపాల్ రెడ్డి, ఎంపీటీసీ యాదగిరి, లక్ష్మీనరసింహారెడ్డి, తదితరులు ఉన్నారు.