Authorization
Sun April 13, 2025 11:50:59 am
- కలెక్టర్కు బాధితుల వినతి
నవతెలంగాణ-దోమ
అయినాపూర్లో గ్రామాకంఠం భూమినీ కాపాడాలని పలువురు కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజే శారు. గురువారం మండలంలో కలెక్టర్ పర్యటించారు. దోమ మండలంలోని పలు గ్రామాల్లో పోడు భూములు, లావుణి పట్టా భూములు, పరిగి నుంచి దోమ, అయినాపూర్ మీదుగా మహబూబ్నగర్ వెళ్లే బస్సు సమస్యతోపాటు పలు సమస్యలను కలెక్టర్కు విన్నవించారు. గ్రామ కంఠానికి సంబంధించిన భూములను అధికార పార్టీ నాయకులు కబ్జా చేసి, ఫ్లాట్లు చేసి అమ్ముతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు.