Authorization
Sun April 13, 2025 05:26:20 pm
నవతెలంగాణ-ఆమనగల్
ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లి గ్రామానికి చెందిన మదనపురం వెంకటయ్య ఇటీవల అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఐక్యత ఫౌండేషన్ చైర్మెన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ముగ్గురు ఆడపిల్లలతో పాటు, ఉండటానికి ఇల్లు కూడా లేని బాధిత కుటుంబానికి ఐక్యత ఫౌండేషన్ అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పర్వతాలు, నాయకులు మొక్తాల వెంకటయ్య, వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, నితిన్ రెడ్డి, శరణప్ప, శ్రీనివాస్ రెడ్డి, పుల్యా నాయక్, తిరుమల్, శ్రీధర్, హర్యా నాయక్, రచ్చ శ్రీరాములు, మస్న గిరి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.