Authorization
Sat May 03, 2025 04:58:48 pm
నవతెలంగాణ-దోమ
మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మౌత్సవాలు ఈ నెల 27వ తేది నుంచి 28వ తేది వరకు జరుగుతాయని ఆలయ నిర్వాహకులు, కార్యనిర్వాహకులు కమిటీ సభ్యులు, సిబ్బంది, గ్రామస్తులు, గ్రామపెద్దలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 27న సోమవారం ఉదయం ధ్వజారోహణము, ఉదయం 10 గంటలకు ఆంజనేయస ా్వమి అభిషేకం,ఉదయం 12-30 గంటలకు గణపతి హౌమము,మధ్యాహ్నం 2-00 గంటలకు నరసింహ స్వామి వారికి హౌమము,మంగళ హారతి,ప్రసాద విత రణ రాత్రి 7 గంటల నుండి 11 గంటల వరకు ఎదు ర్కొలు కార్యక్రమలు 28న మంగళవారం రోజు ఉదయం 6-00 గంటలకు సుప్రభాతం,ఉదయం 8-00 గంటలకు స్వామివారి అభిషేకం,ఉదయం 10 గంటలకు చండి హౌమము,ఉదయం 11-30 నిమిషాల స్వామివారి తిరు కల్యాణోత్సవం మంగళ హారతి సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు స్వామివారికి ఉయ్యాల సేవ 8 గంటల నుండి 11 గంటల వరకు మల్లేపల్లి భజన భక్త బృందంతో భజన కార్యక్రమములు జరుగుతాయని తెలిపారు.