Authorization
Fri May 02, 2025 04:01:11 am
నవతెలంగాణ-కుల్కచర్ల /చౌడాపూర్
ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా కలప తరలిస్తున్న ట్రాక్టర్లను శనివారం కుల్కచర్ల పోలీసులు పట్టుకున్నారు. కుల్కచర్ల ఎస్ఐ గిరి తెలిపిన వివరాల ప్రకారం..చౌడాపూర్ మండలపరిధిలో పోలీసులు గస్తి నిర్వ హిస్తుండగా విరాపూర్, మందిపాల్ గ్రామాలకు చెందిన రబ్బమోని యాద య్య, సంటి రమేష్‌లు కలప ట్రాక్టర్లతో ఎదురైయ్యారు. అనుమతి పత్రాలు అడగగా సమాధానం లేకపోవటంతో ట్రాక్టర్లను కుల్కచర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేశారు. ఇట్టి ట్రాక్టర్లను అటవీశాఖ అధికారులకు అప్పజెప్పారు. అక్రమంగా కలప రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పావని ఎస్ఐ గిరి హెచ్చరించారు.