Authorization
Thu April 10, 2025 08:39:36 pm
- టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్
నవతెలంగాణ-షాద్ నగర్
కేంద్రం పెంచిన ధరలపై, బీఆర్ఎస్ ధర్నాలు చేస్తూ, రాష్ట్రం పెంచిన ధరలపై బీజేపీ ధర్నాలు చేస్తూ ప్రజలను భయ బ్రాంతులకు గురిచేస్తున్నాయని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు.కేంద్ర ప్రభుత్వం సిలిండర్ పై పెంచిన ధరలపై ఆయన స్పందిస్తూ మాట్లాడారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దొందూదొందేనని విమర్శించారు. కేంద్రం విధించిన భారాన్ని తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి గానీ, ఆందోళనలు చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో కేంద్రం సిలిండర్ ధర పెంచితే వైఎస్ హయాంలో కాంగ్రెస్ పెను భారాన్ని మోసి ప్రజలకు సిలిండర్ ధర తగ్గించి ఇచ్చిన సంఘటన ఒకసారి అధికార పార్టీ నాయకులు గుర్తు చేసుకోవాలన్నారు. ప్రజలకు భారాన్ని తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మసలుకోవాలే తప్పా, బహిరంగంగా ఆందోళనలు ఎమిటని నిలదీశారు. ఇప్పటికైనా పెంచిన గ్యాస్, నిత్యవసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనియేడల వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.