Authorization
Wed April 30, 2025 02:24:42 pm
- కౌన్సిలర్ సరితాయాదగిరియాదవ్
నవతెలంగాణ-షాద్ నగర్
భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ల త్యాగం మరువలే నిదని కౌన్సిలర్ సరితా యాదగిరి యాదవ్ అన్నారు. గురు వారం భగత్‌సింగ్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ భగత్ సింగ్‌ని నేటి యువత ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఉన్న అసమానతలు, సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ కొండ చంద్రశేఖర్‌గౌడ్, కార్మిక నేత పినపాక ప్రభాకర్, బీఆర్ఎస్ మున్సిపల్ కార్యదర్శి మలినేని సాంబశివరావు, భిక్షపతి, రోమియో రమేష్, బాస రాజు, ఇప్పలపల్లి సురేష్, నర్సింలు, ఖాజా, డాక్టర్ ప్రవీణ్, నర్సింలుయాదవ్, వంటల శ్రీను, నర్సింలుయాదవ్, వెంకటేష్‌యాదవ్, మంగలి సురేష్, మంగలి శ్రీను, తులసిరాం, తదితరులు పాల్గొన్నారు.