Authorization
Thu May 01, 2025 02:11:43 am
నవతెలంగాణ-మియాపూర్
ప్రయివేటీకరణ ఆపాలి, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైద రాబాద్లోని అంజయ్య భవన్ లోని రాష్ట్ర కార్మిక కార్యాలయంలో లేబర్ కమిషనర్‌కి సంఘం రాష్ట్ర అధ్యక్షులు తుడుం అనిల్ కుమార్ ఆధ్వర్యం లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లేబర్ కోడ్లను రద్దు చేయాల న్నారు. కార్మికుల హక్కులను కాపాడాలన్నారు. కార్మికుల పని ప్రాంతాలలో రక్షణ, కనీస వసతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసిటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భద్రమోని పురుషోత్తం, రాష్ట్ర కమిటీ సభ్యులు రాజు, సుజాత తదితరులు పాల్గొన్నారు.