Authorization
Fri April 04, 2025 08:50:27 am
- ప్రధానోపాధ్యాయులు నాగరాజు
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
పదో తరగతి విద్యార్థులు పదో తరగతి పరీక్షలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని ప్రధానోపాధ్యాయులు నాగరాజు అన్నారు. శుక్రవారం బషీరాబాద్ మండలంలోని జీవన్గి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సమయాన్ని వృథా చేయ కుండా పదో తరగతి పరీక్షకు సిద్ధం కావాలన్నారు. అదేవిధంగా తమ పాఠశాలకు పదో తరగతి పరీక్షలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సదాశివయ్య, వెంకటేశ్వర్లు, మల్లేశ్వరి, నస్రీన్ బేగం, ఇందిరా, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.