Authorization
Thu May 01, 2025 07:17:16 am
- ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ తలారి మల్లేష్
- యాచారం మండల కేంద్రంలో శేఖర్ గౌడ్ దిష్టిబొమ్మ దహనం
- అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
నవతెలంగాణ-యాచారం
నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఈసీ శేఖర్‌గౌడ్ తక్షణమే మాల కులస్తులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ తలారి మల్లేష్ డిమాండ్ చేశారు. మంగళవారం మాలలను కించ పరుస్తూ మాట్లాడిన శేఖర్ గౌడ్ దిష్టిబొమ్మను యాచారం మండల కేంద్రంలో దహనం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ ఓ కాంగ్రెస్ సభలో మాలలను కించపరుస్తూ మాట్లాడడం బాధాకరమైన విషయమన్నారు. ఆయన ఒక బాధ్యతాయుతమైన జాతీయస్థాయి పార్టీలో పని చేస్తూ కిందిస్థాయి వర్గానికి చెందిన వారిని కించపరుస్తూ, మాట్లాడడం దుర్మార్గ మన్నారు. పార్టీ మీటింగులో దళితులను కించపరాచాల్సిన అవసరం ఏముందని తెలిపారు. ఇప్పటికైనా ఈసీ శేఖర్ గౌడ్ ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని మాలలను క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు మొండిగౌరెల్లి సర్పంచ్ బండిమీది కృష్ణ మాదిగ, డైరెక్టర్లు మక్కపల్లి స్వరూప, మద్దెల శశికళ, ఎస్సీ విభాగం మండల అధ్యక్షుడు మండలి గోపాల్, ఉపాధ్యక్షుడు అమరేందర్, మండల ప్రధాన కార్యదర్శి పోలే మహేష్, అందే ఆనంద్, యాచారం అంజయ్య, పెరుమాండ్ల రమేష్, చింటూ, కిషన్, నరేష్, కృష్ణ, సంపత్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.