Authorization
Fri May 02, 2025 08:13:25 pm
- ప్రియాంక గాంధీ బహిరంగ సభను విజయవంతం చేయాలి
- రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాచమల్ల సిద్దేశ్వర్
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రాణాలకు తెగించి పోరాడి సాధించు కున్న స్వరాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించలేని ప్రభుత్వాన్ని గద్దేదించేందుకు యువత గర్జించాలని రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాచమల్ల సిద్దేశ్వర్ అన్నారు. సోమవారం సరూర్నగర్ స్టే డియంలో నిర్వహించే యువ సంఘర్షణ సభను విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్వరా ష్ట్రంలో విద్యార్థులకు, యువకులకు ఉద్యోగాలు రాలేదు కానీ కల్వకుంట్ల కుటుంబంలో మాత్రం ప్రతి ఒకరికీ ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నా రు. ఉద్యోగ నియమా కాల కోసం రాసిన పరీక్ష పేపర్లు కూడా లీకులు కావడం నిరుద్యోగులను నిరాశ పర్చుతుందన్నారు. ఇంతటి నిర్లక్ష్య పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించేందుకు యువత ముందుకు రావాలని సూచించారు. యువ సంఘర్షణ సభలో యూత్ డిక్లరేషన్ ప్రకటించడానికి అఖిల భారత కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వస్తున్నారని తెలిపారు. ఈ సభను విజయవంతం చేయడానికి రాష్ట్ర నలుమూలల నుంచి యువత తరలి రావాలని కోరారు.