Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ వన్నాడపు అరుణమ్మ సింగారంలో సెంటర్ ప్రారంభం
నవతెలంగాణ-యాచారం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ వన్నాడపు అరుణమ్మ సూ చించారు. బుధవారం మండల పరిధిలోని నజ్జిక్ సింగారంలో కంటి వెలుగు సెంటర్ను ఆమె ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ కంటి సమస్యలు ఉన్నవారు ఈ సెంటర్ ద్వారా పరిష్కరించుకోవచ్చునని ఈ సెంటర్లో ఉచి తంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కండ్ల అద్దాలను అంది స్తారని చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ప్రాథ మిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ రాజలక్ష్మి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.