Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 ఏళ్ల నుంచి 36 ఏళ్ల వారే అర్హులు
- 15 నుంచి 17 వరకు క్రీడా పోటీలు
- ఈనెల 13వ తేదీన వివరాలు నమోదు
- ఎంపీపీ అనురాధ రమేష్ వెల్లడి
నవతెలంగాణ-పెద్దేముల్
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం కోసమే చీఫ్ మినిస్టర్ కప్ పేరిట క్రీడా పండుగకు కేసీఆర్ శ్రీకారం చుట్టారని పెద్దేముల్ ఎంపీపీ అనురాధ రమేష్ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చాంబర్లో ఎంపీపీ అనురాధ రమేష్, ఎంపీడీవో లక్ష్మయ్య, ఎంఈఓ వెంకయ్య గౌడ్, ఎస్సై అన్వేష్‌రెడ్డి, పీఈటీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ....15 ఏళ్ల నుంచి 36 ఏళ్ల వారే క్రీడా పోటీల్లో అర్హులన్నారు. ఈనెల 15 నుంచి 17 వరకు క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలి పారు. క్రీడా పోటీలకు ఎంపీపీ అనురాధ రమేష్ అధ్యక్షు లుగా ఎంపీడీవో నెంబర్ కన్వీనర్‌గా, జడ్పీటీసీ, తహసీ ల్దార్, ఎంఈఓ, ఎస్సై, పీఈటీలు సభ్యులుగా వివరిస్తార న్నారు. పురుషులు, మహిళలు, వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో.1 00 మీటర్ 400 మీటర్ రన్నింగ్ పురుషులకు, మహిళ లకు వేరువేరుగా నిర్వహిస్తారన్నారు. పురుషులకు మాత్ర మే ఫుట్ బాల్ ఉంటుందన్నారు. క్రీడల్లో పాల్గొనే క్రీడాకారు లు మరింత సమాచారం కోసం నర్సిరెడ్డి.. 81065043 83 ఫోన్ నెంబర్‌కు సంప్రదించాలని కోరారు. ప్రతి క్రీడా కారుడూ క్రీడల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.