Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సంచార విజ్ఞానం | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Dec 17,2022

సంచార విజ్ఞానం

           'మంచి పుస్తకం వంద మంది మిత్రులతో సమానం' అన్నారు పెద్దలు. వాస్తవానికి పుస్తకమే ఒక ప్రపంచం. ఎందుకంటే మనిషి ఏ రంగంలో అడుగుపెట్టాలన్నా దానికి కావాల్సింది విజ్ఞానం. మరి విజ్ఞానం రావాలంటే ఏ పుస్తకమో చదవడం తప్పనిసరి. ఒక్క పుస్తకం ద్వారానే ఎన్నో అంశాలపై చర్చిస్తుంటుంటే, డిబెట్లు పెడుతుంటే, వందల పుస్తకాలు చదివితే వచ్చే విజ్ఞానం ఎంత? కొండంత. కానీ మనిషి మారుతున్న ఈ యాంత్రీక జీవనంలో పడి పుస్తకాలు మరుస్తున్నాడు. మన కండ్ల ముందు ఎన్నో పుస్తకాలు కనిపిస్తున్నా వాటిని వినియోగించుకోవడంలో కొంత నిరక్ష్యం ఉంటున్నదనేది కాదనలేని సత్యం. దేశంలో ఒకప్పుడు లైబ్రెరీలు లేని సమయంలో విజ్ఞానాన్ని అందించేందుకు సంచార గ్రంథాలయాలను స్థాపించారు. పుస్తక పఠనాన్ని చిన్నారుల్లో, యువతలో, పెద్దల్లో వ్యాపింపచేయాలనే ఆశయం, సంకల్పంతో ఈ గ్రంథాలయాలు ముఖ్య భూమికను పోషించాయని చెప్పొచ్చు. ఎడ్లబండి, గుర్రపు టాంగా, సైకిల్‌, రిక్షా, గాడిద, ఒంటె ద్వారా పుస్తకాలను ప్రజలకు అందించారు. ఆ తర్వాత కాలంలో స్కూటర్‌, కారు, మినీవ్యాను ప్రస్తుతం బస్సుల ద్వారా పుస్తకాలను, పత్రికలను మారుమూల ప్రాంతాల్లో చదువరులకు, విజ్ఞానం, అక్షరాస్యత కోసం అందజేస్తున్నారు. అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ప్రధానంగా ఇప్పుడున్న యువత లైబ్రెరీలను ఎందుకు సద్వినియోగం చేసుకోవడం లేదు. సెల్‌ఫోన్‌పైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కానీ బుక్స్‌ను సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ల్లో చదువుతున్నారు. రోజురోజుకూ లైబ్రెరీలకు వెళ్లే వారి సంఖ్య కూడా తగ్గుతుంది. కానీ ఒకప్పుడు సంచార గ్రంథాలయాల్లో చదువుకుని ప్రయోజకులయ్యారు. అప్పటి సంచార విజ్ఞానాన్ని తెలుసుకుంటే ఇప్పుడున్న గ్రంథాలయాల విశిష్టత అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రయత్నమే 'సంచార గ్రంథాలయాలు'పై ఈ వారం వ్యాసం.

           పుస్తకం ఓ మంచి నేస్తం. ఆ పుస్తక పఠనం ద్వారా జ్ఞానం, పద సంపద పెరుగుతుంది. మనషుల వ్యక్తిత్వాలు, సమాజం, వివిధ అంశాల పట్ల మంచి అవగాహన వస్తుంది. ఆ పుస్తక జ్ఞానాన్ని నలుగురికి పంచాలని, చదువును పది మందికి నేర్పాలనే ఉద్దేశంతో భారతదేశంలో 1925లో థియొసాఫికల్‌ సొసైటీ తమిళనాడులోని మన్నారు గుడిలో సమావేశమైంది. విద్యను గ్రామంలో ఉన్న ప్రజలందరికీ అందించాలని, దానికి కావాల్సిన పాఠశాలను ఈ సంస్థ ఏర్పాటు చేస్తుందని చెప్పడంతో పాటు 14 నుంచి 28 ఏండ్ల వయసున్నవారు ఎవరైనా ఈ పాఠశాలలో చదువుకోవచ్చని సొసైటీ సభ్యులు శ్రీరావు సాహెబ్‌ ఎస్‌.వి. కనకాస భాయి పిళ్లై చెప్పారు. ఇలా కొద్దిరోజుల పాటు తుంకూర్‌, మన్నారు గుడి ప్రాంతాలలో 1927 వరకు పాఠశాలను నడిపారు కానీ విద్యార్థులలో చదివే అలవాటు ప్రబలాలి అంటే వారికి పుస్తకాలు అందుబాటులో ఉండాలి. పుస్తకాలు కొనుక్కునే ఆర్థిక స్తోమత అందరికీ లేదు. ఈ మారుమూల ప్రాంతాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం కష్టం. అందుకే సంచార గ్రంథాలయం ఏర్పాటు చేయాలనే ఆలోచన తట్టింది. తక్షణమే పంచాయతీరాజ్‌ విభాగంలో ఇంజనీర్‌గా పని చేస్తున్న కనక సబాయి పిళ్లై పుస్తకాలను మోసుకెళ్లేందుకు ఒక ఎడ్ల బండిని తయారు చేయించారు. మేలవసాల్‌, మున్నారు గుడి తాలూకాలో 21 అక్టోబర్‌ 1931లో భారత గ్రంథాలయ పితామహులు డాక్టర్‌ ఎస్‌ ఆర్‌ రంగనాథన్‌ గారి చేతుల మీదుగా ఏర్పాటు చేశారు.
మారుమూల ప్రాంతాలకు విజ్ఞానం
           ఎడ్ల బండి మీద పుస్తకాలను మారుమూల ప్రాంతాల్లోకి తోటల పెంపకం, పత్తి సాగు, తేనె పెంపకం, పట్టుపురుగుల పెంపకంకు సంబంధించి పుస్తకాలను అందించేవారు థియొసాఫికల్‌ సొసైటీ ఈ గ్రంథాలయంపై ఆ రోజుల్లోనే 2వేల రూపాయలు ఖర్చు పెట్టింది. 947 పుస్తకాలతో దాదాపు 95 గ్రామాల్లో ఈ ఎడ్ల బండి గ్రంథాలయం పుస్తకాలను అందించింది. దీనితో పాటు గ్రామ ఫోన్‌లో ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నది తీసుకున్న పుస్తకాలు ఎంతమంది చదివి తిరిగి ఇస్తున్నారు. అదేవిధంగా ఆ రోజులలో దిన పత్రికలలో వచ్చే వార్తలను కూడా చదివి వినిపించేవారు. అలా తమిళనాడులో దాదాపు ఒక రెండు దశాబ్దాల కాలం పాటు చక్కటి సేవలు అందించింది. పుస్తక ప్రేమికులైన అక్షరు రౌతారి, శతాబ్‌ మిశ్రా ఒరిస్సా రాష్ట్రంలో గ్రామీణ గిరిజనులకు విజ్ఞానాన్ని, పుస్తకాలు అందించాలనే ఉద్దేశంతో 'వాకింగ్‌ బుక్‌ ఫెయిర్స్‌' కార్యక్రమం చేపట్టి నాలుగు వేల పుస్తకాలతో సెకండ్‌ హ్యాండ్‌ మారుతి కారులో బొమ్మల పుస్తకాలు, చిన్నపిల్లల పుస్తకాలు, కథల పుస్తకాలు, రామాయణం, మహాభారతం పుస్తకాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలలో 85 రోజులలో 11 వేల కిలోమీటర్లు చుట్టి మారుమూల ప్రాంతాలలో ప్రజలకు విజ్ఞానాన్ని పుస్తకాల, దిన పత్రికల రూపంలో అందించారు.మొబైల్‌ లైబ్రరీ ఇన్‌ ఎ బ్యాక్‌ అనే ఎ బైస్కిల్‌. ఒడిస్సా రాష్ట్రంలో కళానిధి అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా 15 మంది స్వచ్ఛంద కార్యకర్తలు మారుమూల ప్రాంతాల్లోని గ్రామాలకు సైకిళ్ల ద్వారా పుస్తకాలందిస్తున్నారు. ప్రతిరోజు కనీసం ఒక పుస్తకమైన పిల్లలు చదవాలని వారి ఉద్దేశం.మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 2019 సంవత్సరంలో కితాబ్‌ ఘర్‌ పుస్తకాలు చదవాలనే కోరిక ఉండి ఎవరైతే పుస్తకాలు కొనుక్కునే ఆర్థిక స్తోమత లేదో వారికి సంచార గ్రంథాలయం ద్వారా 'కితాబ్‌ ఘర్‌' అనే కార్యక్రమం ద్వారా పుస్తకాలు అందిస్తుంది.తెలుగు రాష్ట్రాలలో 20వ శతాబ్దం ప్రారంభంలోనే సంచార గ్రంథాలయాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు విజ్ఞాన సేవలందించాయి. ఓపెన్‌ యూనివర్సిటీ విశ్వవిద్యాలయాల కాన్సెప్ట్‌ అయిన ఎడ్యూకేషన్‌ ఎట్‌ యు డోర్‌ స్టెప్‌ అదే విధంగా (లైబ్రరీ సర్వీసెస్‌ ఎట్‌ యువర్‌ డోర్‌ స్టెప్‌) గ్రంథాలయాలు మీ చెంతకి అనే వినూత్న కార్యక్రమం సంచార గ్రంథాలయాల ద్వారా సాఫల్యం అవుతుంది.
తెలంగాణలో మొదటగా ఎడ్లబండిపై..
           తెలంగాణ ప్రాంతంలో మొదటి సంచార గ్రంథాలయం ఎడ్ల బండి మీద బాల్కొండ నిజామాబాద్‌ జిల్లాలో 1924 లో ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌లో బాలయ్య అనే గ్రంథాలయ సేవకుడు పుస్తకాలను సైకిల్‌ మీద తీసుకుని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ఇచ్చి చదివిన తర్వాత తీసుకొచ్చేవారు. అంతకన్నా ముందు తెలంగాణ ప్రాంతంలో వట్టికోట ఆళ్వార్‌ స్వామి ప్రజలకు విజ్ఞానమందించేందుకు బుట్టల్లో, గంపల్లో పుస్తకాలు నింపుకుని ప్రజలకు అందించి చదివిన తర్వాత తిరిగి తీసుకునేవారు. మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా బిబులియో బస్‌ ఏలూరులో 1958లో ఏర్పాటు చేశారు. వెస్ట్‌ గోదావరిలో ఏర్పాటు చేయబడిన సంచార గ్రంథాలయం దాదాపు 88 గ్రామీణ ప్రాంతాలు (ఏలూరు, చింతలపూడి, పోలవరం తాడేపల్లిగూడెం తాలుకాలలో) సంచరించేది. హైదరాబాద్‌ సిటీ గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన సంచార గ్రంథాలయం హైదరాబాద్‌ సికింద్రాబాద్‌ ప్రాంతాలలో వారానికి 40 చోట్ల సంచరించేవి. అంటే ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞానాన్ని అందించేవి అన్నమాట. 1979 మార్చి నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నందు 23 జిల్లాలో 52 రిక్షా సంచార గ్రంథాలయాలు నడపబడ్డవి. రెండు మొబైల్‌ లైబ్రరీలు ఏలూరు, హైదరాబాద్‌లో కలవు. 1979 నందు 64 సంచార వ్యాను గ్రంథాలయాలు , 324 రిక్షా సంచార గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో నిర్ణయం తీసుకున్నారు.కానీ అది కార్యరూపం దాల్చలేదు. జిల్లా గ్రంథాలయ సంస్థలు ఏర్పడిన తర్వాత కూడా గుంటూరు రాజమండ్రి, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలో 1970 వరకు సంచార గ్రంథా లయాలు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యా ర్థులకు, యువకులకు, వయోవద్ధులకు చక్కటి విజ్ఞాన సేవలందించాయి. సిటీ గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 1980 వరకు సంచార గ్రంథాలయం నడిచింది.
ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం వారు పాతూరి నాగభూషణం పేరు మీద సంచార గ్రంథాలయం ప్రపంచ అక్షరాస్యత దినోత్సవంగా 8సెప్టెంబర్‌ 2015 నుంచి విజయవాడ చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాలకు విజ్ఞానాన్ని అందిస్తున్నది.
           సంచార గ్రంథాలయాల ప్రధాన ఉద్దేశం ఏమనగా పుస్తక పఠనాన్ని సజీవంగా ఉంచడం, ఆర్థిక స్థోమత లేక ఎవరైతే పుస్తకాలు చదవాలని కోరుకునే వారు ఉన్నారో, విజ్ఞానం పొందాలనుకునే వారికి సంచార గ్రంథాలయం ఒక సాధనంగా, ప్రేరకంగా ఉపయోగపడతాయి. అంతే గాక సంచార గ్రంథాలయాల (మొబైల్‌ లైబ్రరీ) ద్వారా రీచింగ్‌ టు అన్‌ రిచింగ్‌ ఏరియా గ్రంథాలయాలు స్థాపించిదానికి, పుస్తకాలూ తీసుకెళ్లడానికి సాధ్యం కానీ ప్రాంతాల్లో కూడా సంచార గ్రంథాలయాల ద్వారా కొండల్లో, గుట్టల ప్రాంతాలలో ఉన్న ప్రజలకు, గిరిజనులకు దినపత్రికలను, వారపత్రికలను, విద్యా ర్థులకు బొమ్మల పుస్తకాలను, టెక్స్ట్‌ పుస్తకాలను, మహిళలకు సంబంధించి వంట పుస్తకాలను అందిస్తు వారిని చైతన్య వంతులుగా చేస్తూ విజ్ఞానం అందరికీ సమానంగా అండాలనే ఉద్దేశంతో సంచార గ్రంథాలయాలు పనిచేస్తున్నాయి.
          కొమరంభీమ్‌ జిల్లాలో 'పిట్టగూడు' లైబ్రెరీ ''Soon they would spend all day there, locked up inside the truck, reading undisturbed. There were no windows but there were thousands of windows, in every book on every shelf - David Whitehouse'' చెప్పినట్లు ఈ మధ్యనే అసిఫాబాద్‌ కొమరం భీమ్‌ జిల్లాలో పిక్లాతాండాలో వెలసిన లైబ్రరీ ఒక చిన్న చెక్క స్తంభం మీద నిలబడిన చెక్క పెట్టె. చెక్కపెట్టెకొక గాజు తలపు. లోన కొన్ని పుస్తకాలంతే. ప్రతిరోజు పొద్దునే ఈ పెట్టెని పంచాయతీ కార్యాలయం నుంచి రచ్చబండ దగ్గరకు తీసుకువచ్చి నిలబెడతారు. పెట్టె స్తంభానికి అటూ ఇటూ బెంచీలు ఏర్పాటు చేస్తారు. అదే పిక్లాతాండా లైబ్రరీ. పిడికెడు పుస్తకాలకు ఇంత అందమయిన ఆకారం ఇచ్చింది ఎవరై ఉంటారు. ఇది ఒక అసాధారణమైన ఆలోచన. పుస్తకాన్ని ఒక ఊరికి ఇలా కొత్త తరహాలో ప్రచారంలో చేయాలనుకోవడం ఎంత ముచ్చటయిన విషయం. దీనికి జిల్లా అదనపు కలెక్టర్‌ కర్నాటి వరుణ్‌ రెడ్డి పిట్టగూడు గ్రంథాలయం అని పెట్టారు. ఆ తండాలో ఉన్న పిట్టగూడు గ్రంథాలయంలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎవరైనా వారికి నచ్చిన పుస్తకాలు చదువుకోవచ్చు తిరిగి ఆ ప్రాంతంలో ఉంచాలి. ఇలా మారుమూల ప్రాంతాలలో మహిళలకు, విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించాలనే వినూత్నమైన ఆలోచనలు ఆహ్వానించాలి. ఇలా తెలంగాణ వ్యాప్తంగా అనేక మారుమూల ప్రాంతాలలో కూడా ఔత్సాహికులు, గ్రంథాలయ సేవకులు ముందుకు తెచ్చి విజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేయాలి. దానికి ప్రభుత్వాలు తగిన సహాయ సహకారాలు అందిస్తే కార్యక్రమం ఇంకా ఫలవంతం అయ్యే ఆస్కారం ఉంటుంది.
          ఇక ప్రస్తుత పోటీ ప్రపంచంలో వివిధ సామాజిక మాధ్యమాల ఉధతిలో పుస్తకం విలువ తగ్గి పోయిందని, పుస్తక పఠనంను స్మార్ట్‌ఫోన్లు, సామా జిక మాధ్యమాలు ఆక్రమించాయని చెబుతున్న సందర్భంలో ప్రభుత్వాలు, ఔత్సాహికులు గ్రంథాలయాలు గ్రామీణ పట్టణ ప్రాంతాలలో నెలకొల్పినప్పటికిని అన్ని మారుమూల ప్రాంతాలలో కొండలు, గుట్టలలో నివసించే ప్రాంత ప్రజలకు గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోవచ్చు.దానికి అనేక సాంకేతికపరమైన, పాలనాపరమైన కారణాలు ఉండవచ్చు. వాటి అన్నింటినీ అధిగమించి ఈ సంచార గ్రంథాలయాలు వివిధ ఔత్సాహికుల, ఉన్నతుల, సంస్థల సహకారంతో విజ్ఞానం ప్రజల చెంతకు వెళ్లేవిధంగా కృషి చేస్తున్నాయనే విషయం గమనించాల్సిన అవసరం ఉంది.

కేరళలో ఓడ గ్రంథాలయాలు
సంచార గ్రంథాలయాలు ప్రజలకు విజ్ఞాన అందించడం, అక్షరాస్యతను పెంపొందించడం, నూతన రాజకీయ, ఆర్థిక, సామాజిక, విషయాలను వివిధ మాధ్యమాల ద్వారా అందించడం (పేపర్‌, రేడియో) తద్వారా వారు విజ్ఞానాన్ని సంపాదించి చైతన్యవంతులై, నైతిక విలువలున్న వ్యక్తిగా రూపొందడానికి, అనేక సామాజిక రాజకీయ ఉద్యమాల్లో పాల్గొనడానికి, బాధ్యతాయుతమైన పౌరునిగా ఎదిగేందుకు సంచార గ్రంథాలయాలు తమ పాత్రను పోషించాయి. 1960 సంవత్సరంలో ఢిల్లీ పబ్లిక్‌ లైబ్రరీ సంచార గ్రంథాలయాన్ని ప్రారంభించారు. మొదట డిటిసి బస్సులలో పుస్తకాలతో ఢిల్లీ పట్టణంలో దాని పరిసర ప్రాంతంలో ఉన్న గ్రామాల్లోని ప్రజలకు పుస్తకాలందించే వారు.. దానిని చల్తీ ఫిర్తి లైబ్రరీ అనేవారు.కేరళ రాష్ట్రంలో ఓడ గ్రంథాలయాలు ఇప్పటికీ చాలా చక్కగా వందల సంఖ్యలో పుస్తకాల నింపుకొని మారుమూల ప్రాంతాలలోకి వెళ్లి పుస్తకాలను దినపత్రికలను అందిస్తున్నవి. చదివిన మరుసటి రోజు లేదా రెండు రోజుల తర్వాత పుస్తకాలను దినపత్రికలను తిరిగి తీసుకుంటున్నవి.అలా కేరళ రాష్ట్రం లో దాదాపు 96 బోటు (ఓడ) గ్రంథాలయాలు నడపబడుతున్నవి.

ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన ఏడు సంచార గ్రంథాలయాలు
రౌల్‌ లేమిసఫ్‌ తయారు చేసిన బ్యూనాస్‌ ఎయిరే స్‌, అర్జెంటీనా ప్రాంతంలొ 1979లో 900 పుస్తకాలతో ఫోర్డ్‌ ఫాల్కన్‌ వెహికల్‌ తయారు చేయడం జరిగింది. దాదాపు పదివేల కిలోమీటర్లు తిరిగి 8200 పుస్తకాలను విద్యార్థులకు అందించింది. ముఖ్యంగా యువత ఎక్కువగా మక్కువ చూపేవారు.
ట్రామ్‌ లైబ్రరీ
లైబ్రరీ ఇన్‌ ద ట్రామ్‌. ప్రతిరోజు 70 కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తూ పిల్లలతో పట్టణాభివద్ధి పొందుపరచాలని, పుస్తకాల ప్రాముఖ్యతను, ఎలక్ట్రానిక్‌ పుస్తకాలను ఏ విధంగా అందిపుచ్చుకోవాని ప్రచారం చేస్తున్నారు.
డాంకి మొబైల్‌ లైబ్రరీ
గ్రామీణ ప్రాంతాలైనా ఇథియోపియా దేశంలో గాడిదల మీద పుస్తకాలను ప్రతి స్కూలుకు , ప్రతి గ్రామానికి , చదవాలి అనే తపన ఉన్న విద్యార్థులకు అందిస్తున్నారు. అలా 10 గాడిదలతో 6500 పుస్తకాలందించారు.
బిబ్లియో మోటో కారు
ఇటలీ దేశంలో ఫెర్నాండియా ప్రాంతంలో ఆంటోనియో లా కావా అనే ఉపాధ్యాయుడు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా సౌత్‌ ఇటలీలో రోజుకు 8 గ్రామాలలో విద్యార్థులకు, పెద్దలకు పుస్తకాల అందించే ప్రయత్నం చేస్తున్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పుస్తక పఠనాన్ని వద్ధి చేయడం.
టెల్‌ ఏ స్టోరీ
లిస్బన్‌ దేశంలో ఊబర్‌ సంచార గ్రంథాలయాన్ని 1975లో ఫ్రాన్సిస్కో అంటోలిన్‌ అనే పోర్చుగీస్‌ రచయిత మిగతా మిత్రుల సహకారంతో స్థాపించడం జరిగింది. ఫ్రెంచ్‌, ఇటాలియన్‌, జర్మన్‌, స్పానిష్‌ భాషలలోని 6100 పుస్తకాలను వీధులలోని విద్యార్థులకు అందించేవారు.
క్యామల్‌ బుక్‌ మొబైల్‌
కెన్యా దేశంలో నార్త్‌ ఈష్ట్‌ ప్రాంతంలో 7వేల పుస్తకాలను 12 ఒంటెల ద్వారా వారానికి నాలుగు రోజులు పుస్తకాలను గ్రామీణ ప్రాంతాలకు చేర్చేవారు ముఖ్యంగా కథల పుస్తకాలు బొమ్మల పుస్తకాలు పుస్తక పఠనాన్ని పెంపొందిం చేందుకు అనేక రకరకాల కార్యక్రమాలు నిర్వహించారు.
మిరాకిల్‌ బుక్‌ మొబైల్‌
లాస్‌ ఏంజిల్స్‌లో, ఆక్లాండ్‌ ప్రాంతాలలో పుస్తకాలను విద్యార్థులకు 5600 పుస్తకాలను అందించి పుస్తక పఠనం వైపు మళ్లించారు. ఆంధ్ర ప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం పాతూరి నాగభూషణం పేరు మీద సంచార గ్రంథాలయం 8సెప్టెంబర్‌ 2015 నుంచి నడుపుతున్నారు. దీని ముఖ్య ఉద్దేశం సామాజిక, రాజకీయ,ఆర్థిక విషయాలు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ గ్రంథాలయం పనిచేసింది. ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మనిషి వ్యక్తిగత పరిజ్ఞానం, అక్షరాస్యత, సమాజ అవగాహన కల్పించేందుకు చాలా గ్రంథాలయాలు నెలకొల్పారు.

- డా|| రవికుమార్‌ చేగొని, 9866928327

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చల్లకోసం వచ్చి ముంత దాచినట్లు
తెలుగు కార్టూన్‌కు పూర్వ వైభవం రావాలి
విషాదాంత ప్రేమ‌క‌థా చిత్రం ‘మ‌రో చ‌రిత్ర‌’
పిడుగుపాటుకు తీసుకోవలసిన జాగ్రత్తలు
జిపి బిర్లా గ్రంధాలయం
డీ హైడ్రేషన్‌, సన్‌స్ట్రోక్‌
అమృతంలాంటి కుండ నీరు
పాలెం కళ్యాణసుందరం దాతృత్వం
స్వలింగ వివాహాల చట్టబద్దత సాధ్యమేనా?
కాపర్‌ వైర్‌తో కళాకృతులు
మార్గమధ్య ఎలిఫంటా గుహలు
వేడి నీటిని తాగితే ఏమవుతుంది?
మదర్‌ ఇండియా నర్గీస్‌ దత్‌
సుందరయ్య జన్మదినం, భారతావనికే పర్వదినం
ఉద్యోగస్తుల పనివేళల్లో తీసుకోవాల్సిన ఆహార నియమాలు
యాత్రా స్పెషల్‌
చారిత్రక కట్టడాలు
అనిర్వచనీయ అనుభూతిని పంచే ఎమ్వీ రామిరెడ్డి కవిత్వం
తల్లిదండ్రులకు లేఖ
వాసు మారాడు
బాలల చెలికాడు 'అవధాన పద్యాల బండి' బండికాడి అంజయ్య గౌడు
హిందీ తెరపై మధురగీతాల 'బర్సాత్‌' శంకర్‌ సింగ్‌ రఘువంశీ
జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటుకు అడ్డుకట్ట..!
చరిత్ర తిరగ రాసిన గుడిమల్లన్న
ఉన్నప్పుడు ఉరుకులాట ఎక్కువ, లేనప్పుడు వెంకులాటలు ఎక్కువ
మన చారిత్రక వారసత్వ సంపద
కెరమెరి మండలంలోని అడవులలో కొత్త కాలమ్నార్‌ బసాల్ట్స్‌
ఆర్గానిక్‌ కొర్రలు (ఫింగర్‌ మిల్లెట్స్‌ / ఫాక్స్‌టెయిల్‌ మిల్లెట్స్‌
తెలుగు నాటక విద్యాలయం అవశ్యం
భూమిని కాపాడుకుందాం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.