Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
శ్రమజీవుల జీవన విధానానికి అక్షర దర్పణం 'మేడిపండు' | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Dec 17,2022

శ్రమజీవుల జీవన విధానానికి అక్షర దర్పణం 'మేడిపండు'

        శ్రమజీవుల జీవన విధానంలోని, మానసిక సంఘర్షణకు అక్షర దర్పణం రాచమళ్ళ ఉపేందర్‌ రచించిన 'మేడిపండు' కథల సంపుటి. సమాజాన్ని అక్షరాలతో నిగ్గదీసిన కవి అంతర్మధనం డైబ్బై ఐదు వసంతాల స్వాతంత్య్ర భారతావనిలో అభివద్ధికి నోచుకోని మారుమూల ప్రాంతాల్లోని నిరుపేదల కష్టాల ముఖచిత్రమే ఈ పుస్తకం. ఓట్లు అడుక్కుంటూ వీధి వీధి తిరిగినోడు, నేడు కోట్ల ధనం దండుకుంటుండు. తరతరాలకు తరగని సంపదను వెనకేసుకుంటుండు. ఓట్లు వేసిన సామాన్యుడు, తన నుదుటి రాతను నిందించుకుంటూ వెట్టిచాకిరీ చేస్తూ మగ్గిపోతుండు. దవాఖానాల చుట్టూ తిరుగుతుండు. దీనికి కారణమేమిటని? బాధ్యులెవ్వరని? సమాధానం కోసం సంధించిన అక్షరాలే సంపుటిలోని కథలు. అనేక సాహిత్య సంస్థలు నిర్వహించిన కథల పోటీల్లో ఉత్తమ కథలు విభాగంలో ఎన్నో పురస్కారాలను అందుకుంటూ, ''అక్షరాల తోవ'' అనే సాహిత్య వేదిక సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తూనే, వర్ధమాన కవులను ప్రోత్సాహిస్తూ, తనలోని భావాలను నలుగురితో పంచుకునే, కవి, కథా రచయిత, వ్యాసకర్త. ఇలా అనేకానేక రంగాల్లోనూ, రాణిస్తున్న ఆయన మస్తిష్కం మధనం నుండి పురుడు పోసుకున్న కథల సంపుటి ఇది. మేడిపండులా కనిపించే సమాజంలో అంతరంగా దాగిన అనేక సమస్యలను తనదైన శైలిలో,కవి కోణంతో చాలా దగ్గరిగా, నిశితంగా పరిశీలిస్తూ, అక్షరీకరించిన, సగటు సామాన్యుని జీవన విధానం, కన్నులకు కట్టినట్లుగా వివరిస్తూ మనకు అందించిన కథల అక్షయపాత్ర ఈ 'మేడిపండు' కథల 'సంపుటి.
           ఒక కథ చదివిన తరువాత,ఆ కథలోని పాత్రలు మనతో కొన్ని రోజులు ప్రయాణించాలి. అటువంటి కథలను పాత్రలను సష్టించి, సమాజంలోని వాస్తవ సంఘటనలో వాటిని ప్రతిష్టించిన కథల మణిహారమే మేడిపండు. కథ లక్షణాలు మనం పరిశీలించినట్లయితే, కథకు ప్రారంభం ఎంత ముఖ్యమో ముగింపునకు అంతకంటే ప్రాముఖ్యత ఉంటుంది. రెండింటినీ సమన్వయ పరిచే మధ్యస్థంగా పాఠకుల్ని కథనం వైపునకు పరుగులు పెట్టించాలి. ఊహకందని ముగింపుతో,కథ ముగింపు కోరుకుంటాడు పాఠకుడు. ఈ విషయాన్ని దష్ఠిలో పెట్టుకుని సంపుటిలో చాలా వైవిధ్యమైన, ఇతివత్తాలను ఎన్నుకుని కథా రచయితగా తనని తాను నిరూపించుకున్నారు రాచమళ్ళ ఉపేందర్‌. ఇక్కడ మనం వేమన పద్యం గుర్తు చేసుకుందాం. మేడిపండు చూడ మేలిమైయుండు పొట్టవిప్పి చూడ పురుగులుండు... ఈ వేమన పద్యం మీకు తెలిసిందే.కానీ ఈ మేడిపండు సంపుటి మొదటి పేజీ నుండి చివరి పేజీలవరకు మధ్యతరగతికి చెందిన మనిషి జీవన విధానం, తను ఎదుర్కొం టున్న సమస్యలు, వాటిని పరిష్కరించడానికి సహకరించే కుటుంబ బంధాలు... ఇలా చెప్పుకోవడానికి ఎన్నో.. మనకు కనిపిస్తూ పలకరిస్తుంటారు.
కన్నీటి ప్రవాహం కథ చదువుతుంటే నాకు సిరివెన్నెల సీతారామశాస్త్రి ''అర్దశతాబ్దపు అజ్ఞానాన్ని స్వాతంత్ర మందామా! దానికి స్వర్ణోత్సవాలు చేద్దామా'' అనే పాట గుర్తుకు వస్తుంది. ఎన్ని పంచవర్ష ప్రణాళికలను వేసినా! మారని పేదవాని జీవన విధానం చూస్తుంటే, మనం సాధించిన ప్రగతి ఎక్కడ అనే ప్రశ్న ప్రతి క్షణం వెంటాడుతూనే ఉంది. వేదికపై రాజకీయ నాయకులు చెప్పే మాటే ''మనం అభివద్ధి పదంలో దూసుకు పోతున్నాం'' అని. కానీ ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు మనం అభివద్ధి సాధించాము అని చెప్పుకునే ధైర్యం కానీ తెగువ కానీ నిజాయితీ కానీ మనలో ఉందా? అలా ఉంటే ఇంకా మారుమూల ప్రాంతాల్లో రవాణా వైద్య విద్యా సౌకర్యాలు లేకుండా బ్రతుకుతున్న అనేక జీవితాలకు వెలుగు ఎందుకు అందడం లేదు అని ప్రశ్నిస్తే, మనం సమాధానం తడుముకోవలసిన పరిస్థితి నెలకొంది నేడు.
''కన్నీటి ప్రవాహం'' కథ ఒక వాస్తవిక సంఘటనే. ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో, ఏజెన్సీ ఏరియాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మన సోషల్‌ మీడియాలో, టీవీ డిబెట్‌లో వినిపిస్తూనే ఉంటాయి. ఒకటి రెండు రోజులు చర్చ జరుగుతూనే ఉంటుంది. తర్వాత వాస్తవ సంఘటనలు కాలగర్భంలో కలిసి పోతుంటాయి. కానీ సంఘటనకు మూలమైన ప్రాంతంలోని ప్రజల జీవన విధానంలో మాత్రం ఏటువంటి మార్పునోచుకోదు. మార్పు రాకపోవడానికి కారణం ఎవ్వరు?
         అందులో నా పాత్ర ఎంత? మార్పు తీసుకు రాలేకపోతున్న నేటి వ్యవస్థలోని యంత్రాంగం చేత పని చేయించుకోలేని మన నిస్సహాయతను కాదనగలమా? ఇలా వెంటాడే ప్రశ్నలకు సమాధానం మనం తప్పక వెతకాలి అనిపిస్తుంది కథ చదువుతుంటే. మరో కథ ''మేడిపండు''. సంకలనం ఆయువుపట్టు ఈ కథనమే. సమాజంలో దోపిడీ వర్గాన్ని కొమ్ముకాసే ప్రభుత్వ, పాలక వర్గాలు, వ్యవస్థను ఎలా బ్రష్టు పట్టిస్తుంది తెలిపిన కథ. దోచేవాడు ఒకడు, దండన భరించే వాడు మరొకడు. సామాన్యుని చెంతకు చేరని చట్టాలు, ఉన్నవాడికే ఊడిగం చేస్తూ, సామాన్యుని నడ్డి విరిచేస్తున్నారు. నేటి పాలక వర్గానికి నిదర్శనం ఈ కథనం. సామాన్యునికి న్యాయం జరిగేది ఎన్నడో? అనే ప్రశ్నకు బీజం ఈ కథ. ఉన్నత కుటుంబల ఇండ్లల్లో జరిగే దారుణాలకు , జీవనాధారం కోసం కూలి పని చేసుకునే అమాయకులు ఎలా బలి అవుతారో వివరించిన కథనం.
           సమాజాన్ని అధ్యయనం చేసిన కవి, సమాజంలో తన బాధ్యతను గుర్తించిన కవి. కష్టాలను ఎదుర్కొని, ఎదుటి వారి కష్టాలను అర్దం చేసుకుని, మానవత్వ విలువలు శోధించిన కవి, కలం నుండి జాలువారిన శ్రమజీవుల జీవన విధానం,మానసిక సంఘర్షణకు దర్పణం. అందరూ తప్పక చదివ వలసిన కథల సంకలనం ''మేడిపండు.''
           పుస్తకం కావలసిన వారు రచయిత రాచమళ్ళ ఉపేందర్‌, 9849277968 నెంబర్‌కు రూ.100/- Google pay లేదా phone pay చేసినచో postal charges తీస్త్రవర వారే భరించి మీకు పుస్తకం పోస్టు చేస్తారు.

- రాము కోలా, 9849001201

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చల్లకోసం వచ్చి ముంత దాచినట్లు
తెలుగు కార్టూన్‌కు పూర్వ వైభవం రావాలి
విషాదాంత ప్రేమ‌క‌థా చిత్రం ‘మ‌రో చ‌రిత్ర‌’
పిడుగుపాటుకు తీసుకోవలసిన జాగ్రత్తలు
జిపి బిర్లా గ్రంధాలయం
డీ హైడ్రేషన్‌, సన్‌స్ట్రోక్‌
అమృతంలాంటి కుండ నీరు
పాలెం కళ్యాణసుందరం దాతృత్వం
స్వలింగ వివాహాల చట్టబద్దత సాధ్యమేనా?
కాపర్‌ వైర్‌తో కళాకృతులు
మార్గమధ్య ఎలిఫంటా గుహలు
వేడి నీటిని తాగితే ఏమవుతుంది?
మదర్‌ ఇండియా నర్గీస్‌ దత్‌
సుందరయ్య జన్మదినం, భారతావనికే పర్వదినం
ఉద్యోగస్తుల పనివేళల్లో తీసుకోవాల్సిన ఆహార నియమాలు
యాత్రా స్పెషల్‌
చారిత్రక కట్టడాలు
అనిర్వచనీయ అనుభూతిని పంచే ఎమ్వీ రామిరెడ్డి కవిత్వం
తల్లిదండ్రులకు లేఖ
వాసు మారాడు
బాలల చెలికాడు 'అవధాన పద్యాల బండి' బండికాడి అంజయ్య గౌడు
హిందీ తెరపై మధురగీతాల 'బర్సాత్‌' శంకర్‌ సింగ్‌ రఘువంశీ
జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటుకు అడ్డుకట్ట..!
చరిత్ర తిరగ రాసిన గుడిమల్లన్న
ఉన్నప్పుడు ఉరుకులాట ఎక్కువ, లేనప్పుడు వెంకులాటలు ఎక్కువ
మన చారిత్రక వారసత్వ సంపద
కెరమెరి మండలంలోని అడవులలో కొత్త కాలమ్నార్‌ బసాల్ట్స్‌
ఆర్గానిక్‌ కొర్రలు (ఫింగర్‌ మిల్లెట్స్‌ / ఫాక్స్‌టెయిల్‌ మిల్లెట్స్‌
తెలుగు నాటక విద్యాలయం అవశ్యం
భూమిని కాపాడుకుందాం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.