Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సకల కళావల్లభుడు బి.నర్సింగరావు | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Dec 25,2022

సకల కళావల్లభుడు బి.నర్సింగరావు

            పదమూడు కళలలో ప్రావీణ్యం ఉన్న సకల కళావల్లభుడు బి. నర్సింగరావు. ''నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా, థియేటర్‌ ఆర్టిస్ట్‌గా, స్వరకర్తగా, చిత్రకారుడుగా, మ్యుజీషియన్‌గా, కవిగా, పోటోగ్రాఫర్‌ గా'' ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ''శిల్పకళ, జానపద సాహిత్యం, మానవ పరిణామ శాస్త్రం, జాతి జనుల జీవనస్రవంతి'' వంటి అనేక రంగాలలో ఆయన సాధించిన అత్యున్నత ప్రతిభకు ప్రామాణికం ఆయన పొందిన పురస్కారాలు. నరసింగరావు తీసిన సినిమాలు తక్కువే అయినా, ఆయా చిత్రాల ప్రభావం మాత్రం విశ్వవ్యాపితమయ్యింది. ఆయన తీసిన ఒక్కో సినిమా తెలంగాణ బతుకు చిత్రంగా నిలిచి 'తెలంగాణ సినిమా'కు ఓ బలమైన పునాదిని సృష్టించి, ప్రపంచ చలన చిత్రపటంపై తెలంగాణ సినిమాకి ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. తెలంగాణా సినిమాకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని సాధించి పెట్టిన నరసింగరావు చిత్రాలు 'రంగుల కల'కు 'మా భూమి' పులకరించింది. ఆయన చలన చిత్ర 'ఆకృతి'కి 'మట్టి మనుషులు', 'దాసి' వంటి సామాన్యులే కథానాయకులయ్యారు. ఆయన సృజించిన 'హరివిల్లు'ని చూసి, 'మా ఊరు', 'ది సిటీ' అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల ప్రేక్షకులు ఈ చిత్రాలను ఆదరించారు. తెలంగాణ తెరకు తొలి వెలుగు, కళాత్మక చిత్రాల రూపకర్తగా, మనదేశ సినీ ఉద్యమంలో సత్యజిత్‌రే, మృణాల్‌సేన్‌, రిత్విక్‌ ఘటక్‌, శ్యాంబెనెగల్‌ వంటివారి పరంపరలో చేరిన దృశ్య స్వాప్నికుడుగా, తెలంగాణ జీవన చిత్రాలనే తన సినిమాలుగా రూపొందించిన అచ్చమైన స్వచ్ఛమైన ప్రజాకళాకారుడుగా నిలిచిన నర్సింగరావు పుట్టినరోజు డిసెంబర్‌ 26న జరుపుకుంటున్న సందర్భంగా ''సోపతి'' పాఠకుల కోసం అందిస్తున్న వ్యాసం.
            1946వ సంవత్సరం డిసెంబర్‌ 26 వ తేదీన మెదక్‌ జిల్లా ప్రజ్ఞాపూర్‌ లో భూస్వాముల ఇంట్లో జన్మించిన నర్సింగ రావు గజ్వేల్‌లో 12 ఏండ్ల వయసు వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత నర్సింగరావును వారి చిన్నాన్న దత్తత తీసుకుని సికింద్రాబాద్‌ ఆల్వాల్‌ తీసుకెళ్ళాడు. దీంతో హైస్కూల్‌ చదువు అంతా అక్కడే సాగింది. అయితే నర్సింగరావు పుట్టిన ఊరును విడిచినా, ఆ పల్లెటూరును, అక్కడి వాతావరణాన్ని మరువలేదు. మట్టి వాసనల గుభాళింపులోని సౌందర్యాన్ని అన్వేషించడం మొదలు పెట్టి, పల్లెటూరు బతుకుల అతుకులను, గతుకులను, సంఘర్షణలను పరిశీలించడం అలవరుచుకున్న ఆయనలో పుట్టిన శ్రామిక వర్గ పక్షపాత వైఖరి, వామపక్ష ఉద్యమ ప్రభావం, ప్రజా కళల ప్రదర్శనలో కీలక భాగస్వామ్యం వంటి కారణాలు. ఆయనను సినీ నిర్మాణానికి ప్రేరేపించాయి. స్వతహాగా పెయింటింగ్‌, ఫోటోగ్రఫీ, నటన, సంగీతం, సాహితీ సృజన వంటి విభిన్న కళారూపాలతో ఆయనకున్న మమకారం, అధికారం ఆయనను సమస్త కళల సమగ్ర కళారూపమైన సినిమా సృష్టి వైపు నడిపించాయి.
నర్సింగరావు చిత్రాలు
'మా భూమి'
            1980లో నర్సింగరావు నిర్మించిన 'మాభూమి' వచ్చింది. ''భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం'' జరిగిన ఈ పోరాటాన్ని వాస్తవిక కోణంలో ఆవిష్కరించిన చారిత్రక దృశ్య రూపం ''మా భూమి''. తెలంగాణ సాయుధ పోరాటం కథాంశంతో వచ్చిన ఈ సినిమాకు బెంగాలీ వాడైన గౌతం ఘోష్‌ దర్శకత్వం చేశాడు. కిషన్‌ చందర్‌ రాసిన 'జబ్‌ ఖేత్‌ జాగీ' నవలికకు చిత్రరూపమిది. అపూర్వ ప్రజాదరణతో విజయవంతంగా నడచిన మాభూమి ఎన్నో ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌?కు వెళ్లింది. వంద గొప్ప భారతీయ చిత్రాల్లో ఒకటిగా ఈ చిత్రాన్ని సిఎన్‌ఎన్‌ గుర్తించింది. ఈ సినిమా బెస్ట్‌ మూవీ, బెస్ట్‌ స్క్రీన్‌ప్లేగా రెండు నంది అవార్డులు కూడా అందుకుంది. కాగా 'మాభూమి' సినిమాలోని పాటలూ జనజీవితంలోవే. 'బండెనక బండికట్టి..' అనే పాట నిజామ్‌ వ్యతిరేక పోరాటంలో బండి యాదగిరి చేసిన రచన. ఆ పాటను ఈ సినిమాలో వాడారు. నిజజీవితంలో ఆ పాటను విస్తృతంగా పాడుతూ వచ్చిన విప్లవ వీరుడు గద్దర్‌తోనే సినిమాలోనూ ఆ పాట పాడించారు. గద్దర్‌ మీదే చిత్రీకరించారు. అలా గద్దర్‌ తొలిసారి తెరపై కనిపించారు. 'పల్లెటూరి పిల్లగాడ... పసులగాసే మొనగాడా...' అనే పాట ప్రజాకవి సుద్దాల హనుమంతు రాసిన గీతం. 'జననాట్యమండలి' సంధ్య గొంతులో వింటే గుండె బరువెక్కుతుంది.'పొడల పొడల గట్ల నడుమ...' నిజామాబాద్‌ నుంచి సేకరించిన పాట. కె.బి.కె. మోహన్‌రాజు పాడారు.
'దాసి'
            తెలంగాణలో 1920 కాలంనాటి దొరల నిరంకుశ పాలనలో చితికిపోయిన గ్రామ ప్రజల జీవితాలను ప్రతిబింబించిన 'దాసి' 1988 లో విడుదలైంది. నర్సింగరావు రచించి, దర్శకత్వం వహించి, నిర్మించిన చిత్రమిది. భావ వ్యక్తీకరణకు ప్రాధాన్యమిస్తూ ఆద్యంతం వాస్తవిక ధోరణిలో రూపొందించబడింది. ఈ చిత్రం జాతీయ స్థాయిలో అయిదు అవార్దులు గెలుచుకొంది. ఒక తెలుగు చలన చిత్రానికి ఇన్ని అవార్దులు రావడం ఇదే ప్రధమం. తెలుగులో ఉత్తమ సినిమాగా ఈ చిత్ర రూపకర్త 'బి.నరసింగరావు', జాతీయ ఉత్తమ నటిగా ఈ చిత్రంలో దాసిగా కామాక్షి పాత్రను పోషించిన ప్రముఖ నటి 'అర్చన', ఉత్తమ సినిమాటొగ్రఫికి గాను అపూర్వ కిషోర్‌ బిర్‌, ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా సుదర్శన్‌, ఉత్తమ కళా దర్శకుడు గా టి. వైకుంఠం 1989 సంవత్సరపు జాతీయ చలన చిత్ర పురస్కారాలు అందుకొన్నారు. ఈ చిత్రం 1989 లో మాస్కో లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో డిప్లొమా ఆఫ్‌ మెరిట్‌ అవార్డ్‌ ను కూడా గెలుచుకొంది
'రంగుల కల'
            తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన చిత్రం 'రంగుల కల'. ఈ చిత్రం నర్సింగరావు సెమీ-బయోగ్రఫీ గానే కాక, ఆయనలోకి ఆయన చేసిన 'జర్నీ వితిన్‌'కి తెర రూపం. ఈ సినిమాలో ఎన్నెన్నో కళల కాంట్రిబ్యూషన్‌ ఉంది. అయితే ఆ కళలన్నీ కలిసి ఏకమొత్తంగా రూపొందిన సినిమా, విడి విడి కళలకన్నా భిన్నమైన రూపంలో ప్రేక్షకులకు ఆలోచనా నందానుభూతులను కలిగిస్తుంది. 1983 లో వచ్చిన ఈ చిత్రం 'కళ యొక్క అంతిమ లక్ష్యం సామాజిక ప్రయోజనమే' అనే సత్యాన్ని అత్యంత సహజంగా వాస్తవిక కోణంలో ఆవిష్కరించింది. స్క్రిప్టు రచన, సహ సంగీత దర్శకత్వం, నిర్మాణం, దర్శకత్వం, నటన అనే పంచ రంగులను శ్రద్ధగా అద్ది, ప్రేక్షకుల గుండెతెరలపై 'రంగుల కల'ని సృష్టించింది. ఆయనే!ఈ సినిమా 1984లో బొంబాయిలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో 'ఇండియన్‌ పనోరమ' లో ప్రదర్శించబడటమే కాక, జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా సైతం అవార్డును గెలుచుకుంది.
'మట్టి మనుషులు'
            తెలంగాణ పల్లెల్లో బతుకుదెరువు లేక వలసపోయిన కూలీల జీవితాలు ఏ విధంగా ఛిద్రమవుతున్నావో చూపిన చిత్రం. 'దాసి' కథ లాగే మట్టిమనషులు చిత్ర కథ కూడా పరాధీనంగా బ్రతికే స్త్రీ జీవితం ఎంత దాయనీయంగా ఉంటుందో చూపుతుంది. తాను రాసిన 'చలి' అనే కథను నరసింగరావు 1990 లో మట్టిమనుషులుగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో పోచమ్మ పాత్రలో 'అర్చన', గౌరమ్మ పాత్రలో 'నీనాగుప్త' నరసయ్య పాత్రలో 'మోహిన్‌ అలీబేగ్‌' నటన విమర్శకుల అభినందనలు పొందారు. ఈ చిత్రం ప్రాంతీయ ఉత్తమ సినిమాగా జాతీయ అవార్డు తో పాటు పలు ఇంటర్‌ నేషనల్‌ ఫెస్టివల్స్‌ లలో ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది.
'హరివిల్లు'
            క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లల కథను ప్రధానాంశంగా చేసుకుని నర్సింగరావు రూపొందించిన 'హరివిల్లు' 2003వ సంవత్సరం ఏప్రిల్‌ 2న విడుదలైంది. క్యాన్సర్‌ వ్యాధితో బాధ పడుతున్న బాలుడి ప్రేమ, స్నేహం కోరికల ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై డి. రామానాయుడు నిర్మించారు. ఈ సినిమాకు నరసింగరావు దర్శకత్వంతో పాటు సంగీతాన్నందించాడు. సాయి శుభాకర్‌, భానుచందర్‌ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం 2003 కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఇంటర్నేషనల్‌ క్రిటిక్స్‌ వీక్‌-స్పాట్‌లైట్‌ ఆన్‌ ఇండియా విభాగంలో ప్రదర్శించబడింది.
'ది సిటీ'
            హైదరాబాద్‌ ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు, నిత్య జీవన శైలి తోపాటు నగరాన్ని అల్లుకున్న పేదరికం, చరిత్రకు సాక్ష్యాలుగా నిలచిన చార్మినార్‌, మక్కామసీద్‌, కుతుబ్‌ షాహీల సమాదులు, పురాతన నిర్మాణాలు, పెరుగుతున్న నాగరికత జీవనాన్ని 'ది సిటీ' డాక్యుమెంటరీ మన కళ్ళముందు నిలిపింది. 450 ఏళ్లకి పైగా చరిత్ర కలిగినహైదరాబాద్‌ నగరాన్ని 30 ఏళ్లు తాను చూసిన కళ్లతో నరసింగరావు మనకు చూపించే ప్రయత్నం చేశారు. 1987 లో ఈ చిత్రం వెండి నంది అవార్డును పొందింది.
'మా ఊరు'
            1950 నుండి 1980 వరకు గ్రామాల్లో మారిన జీవన శైలిని ప్రతిబింబిస్తూ రూపొందించిన చిత్రమే 'మా ఊరు'. 51 నిమిషాల ఈ డాక్యుమెంటరీలో గ్రామాల్లో కనిపించే మనోహర దృశ్యాలతోపాటు, ప్రతి గుడిసెలో వినిపించే కవ్వం చిలికిన సవ్వడి, రొకట్లో దంచే శబ్దం, మెల్లగా కదిలే ఆవులు,బర్రెలు, పాలు పీతికే సన్నివేశాలు, పండుగలు, పాటలు, జాతరలను నరసింగరావు సహజ రీతిలో ఆవిష్కరించారు. మా ఊరు డాక్యుమెంటరీని చూసిన శ్యామ్‌ బెనెగల్‌ చే 'తెలంగాణ గ్రామీణ జీవన నేపథ్యంలో వచ్చిన చిత్రాలన్నింటిలోకి మా ఊరు అత్యుత్తమైనదని' ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం పలు అవార్డులు సొంతం చేసుకుంది.
ఆకృతి
            ఋతువులకు, కాలమార్పులకు లోనై ఎండకు ఎండి, వానకు తడిసిన శిలలు ప్రకృతి అనే శిల్పకారుడి చేతిలో వింత వింత ఆకృతులుగా, వైవిద్య రూపాలతో అలరారుతున్న ఈ ప్రాకృతిక సౌందర్యాన్ని ఈ బండరాళ్ళ విలక్షణ అందాలను ఆసరా చేసుకుని నర్సింగరావు రూపొందించిన డాక్యుమెంటరీ ఆకృతి. భాషాతీతమైన భావాలను, భావనలను ఎన్నింటినో ఈ డాక్యుమెంటరీలోని శిలలు వ్యక్తీకరిస్తుంటాయి. మెదడుతో కాకుండా మనసుతోనూ.. అంతర్నేత్రంతోనూచూసి అనుభూతి చెందాల్సిన నైరూప్యత సౌంద ర్యాన్ని 'ఆకృతి'ద్వారా నరసింగరావు మన కలల ముందు సాక్షాత్కరింప చేశారు. 'సేవ్‌ ది రాక్స్‌ సొసైటీ' వంటి సంస్థలకు ఆకృతి ప్రేరణ ఇచ్చింది. 1991 లో వెండి నంది అవార్డుకు ఎంపికైన ఈ డాక్యుమెంటరీ అనేక ఇంటర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ లలో ప్రదర్శితమైంది.
            ఈ క్రమంలో నర్సింగరావు నాలుగు దశాబ్దాల చలనచిత్ర జీవనంలో రూపొందించిన నాలుగు సినీమాలు, మూడు డాక్యుమెంటరీలు, నిర్మాతగా ఒక సినిమా, దూరదర్శన్‌ కోసం నిర్మించిన 8 డాక్యుమెంటరీలకు నిర్మాతగా వ్యవహరించారు. సినీ, సాంస్కృతిక రంగంలో వివిధ ప్రక్రియల్లో చేసిన కృషి విశేష గుర్తిపు పొందింది. తెలుగు సినిమా పై చెరగని చేవ్రాలు చేసి, తెలుగు సినిమాను ఉన్నత స్థాయికి చేర్చిన అనంతరం నర్సింగరావు, స్థానిక జానపద కళలను తెలంగాణ మూలలను- పరిణామ క్రమాలను చూపేందుకు, ఫోటోగ్రఫీ, పెయింటింగ్‌ రంగాలలోకి పునః ప్రవేశం చేశారు. అయన లఘు చిత్రాలు, డాక్యూమెంటరీలు జాతీయ చానెల్స్‌ లో ప్రదర్శితమై విశేష ప్రశంసలు పొందాయి. వీటితో పాటు నరసింగరావు 24 వాల్యూముల కవితలు రాసారు. అందులో 10 వాల్యూములు ప్రచురితమైనాయి. అతనికి థియేటర్‌ రంగంలో గల గాఢమైన అనుభవం, వివిధ రంగాలపై గల అనురక్తి తన పైంటింగ్‌ లకు వినూత్న ఔన్నత్యాన్ని కలిగించాయి. నరసింగరావు పీల్చిన పల్లెగాలి, నేలపరిమళం, అతని వర్క్‌ అఫ్‌ ఆర్ట్‌ కు అంతర్జాతీయ ప్రతిష్ట, ప్రాధాన్యతలను సమకూర్చాయి. ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌ పై తాను ఎడిటర్‌ గా ప్రచురించిన అనేక పుస్తకాలలో ''ఆర్ట్‌ ఏ తెలంగాణ'' తలమానికమైనది. ఈ పుస్తకం ద్వారా వంద సంవత్సరాలుగా తెలంగాణ కళల పరిణామాలు, వికాసాలను అనన్య రీతిలో ప్రపంచం జేజేలు పలికేలా తెలియచేసారు. నరసింగరావు షార్ట్‌ స్టోరీలు రాశారు. థియేటర్‌, సినిమా రంగాల గురించి, ఇతర ఆసక్తి కరమైన రంగాల గురించి వ్యాసాలు రాసారు. ఎందరో కొత్తతరం కళాకారులకు మంచి చెడులను చెబుతూ మార్గదర్శకులయ్యారు. ఆక్స్ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ ప్రచురించిన 'ది ఎంసైక్లోపీడియా అఫ్‌ ఇండియన్‌ సినిమా' అనే పుస్తకంలో నరసింగరావు సినిమాల గురించి ప్రముఖంగా ప్రచురించింది. తాను కథానాయకునిగా నటించి దర్శకత్వం వహించిన 'రంగుల కల' చిత్రం 1984లో ముంబైలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించగా, ఆ సందర్భాన్ని శాశ్వతం చేస్తూ డైరెక్టరేట్‌ అఫ్‌ ఫిలిం ఫెస్టివల్స్‌ ఇండియన్‌ సినిమా పై పుస్తకాన్ని ప్రచురించింది. దీంట్లో ఒక వ్యాసాన్ని ప్రముఖ రచయిత్రి 'ఉమా డా చునా' రాసారు. ఆ వ్యాసంలో ఆమె బి. నరసింగరావును విభిన్న కళల రంగానికి 'పునరుజ్జీవనం కల్పించిన వ్యక్తి' (MAN of Renaissance)గా కొనియాడారు.
'పునరుజ్జీవనుడు' నర్సింగరావు
            ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థలు, విశిష్ట వ్యక్తుల పేరుతో ఏర్పాటైన సమున్నత పురస్కారాలు తరచుగా నరసింగరావును వరిస్తుం టాయి. ఆయన బహుముఖ సృజనా త్మక ప్రతిభాశాలి థియేటర్‌, సినిమా, సంగీతం, సాహిత్యం, చిత్రకళ, శిల్ప కళ, ఫోటోగ్రఫీ, జానపద సాహిత్యం, మానవ పరిణామ శాస్త్రం, జాతి జనుల జీవన స్రవంతి వంటి అనేక రంగాలలో ఆయన సాధించిన అత్యు న్నత ప్రతిభకు ఈ ప్రామాణిక పురస్కారాలు ప్రతీకలు. కొన్ని దశా బ్దాలుగా తెలంగాణ ప్రాంతంలో దాదాపు అన్ని రంగాల్లో ఆయన నెల కొల్పిన సాధికారతకు నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం నర్సింగరావుకు బి. ఎన్‌. రెడ్డి జాతీయ అవార్డును ఇచ్చి సత్కరించగా, పది జాతీయ అవార్డులు, తొమ్మిది రాష్ట్ర అవార్డులు అందుకోవడంతో పాటు అనేక అంతర్జాతీయ అవార్డులు. గౌరవాలు పొందారు. గత రెండేళ్లలోనూ నరసింగరావును వివిధ అంతార్జాతీయ వేదికలు, సంస్థలు అరుదైన పురస్కారాలతో గౌరవించాయి. ఆయనలోని బహుముఖ కళాకారుని సృజనను 2021వ సంవత్సరంలో సింగపూర్‌ 'ద ఎలైట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ వరల్డ్‌ కల్చరల్‌ అండ్‌ ఆర్ట్‌ సొసైటీ గుర్తించి 'ఇంటర్నేషనల్‌ మల్టీ కల్చరల్‌ డిస్టింగిష్డ్‌ హానరరీ 'అడ్వయిజర్‌'గా ఎంపిక చేసింది. బహుళ సంస్కృతులను ఆకళింపు చేసుకున్న అంతర్జాతీయ ప్రముఖులతో ఏర్పాటైన ఆ సంస్థకు 160 దేశాలలో సబ్యులుండగా, వీరు తమ సంస్థకు గౌరవ సలహాదారులుగా నియమించుకున్నది కేవలం 12 మందిని మాత్రమే. మొరాకో, ఫిలిప్పైన్‌ దేశాలు నరసింగ రావుకు డాక్టరేట్లు ప్రదానం చేశాయి. సింగపూర్‌, యునైటెడ్‌ కింగ్డమ్‌ దేశాలు సత్కరించాయి. విమేన్‌ అఫ్‌ హార్ట్స్‌, లండన్‌ సంస్థ 'ఎ జెంటిల్‌ మాన్‌ విత్‌ ఎ హార్ట్‌' అవార్డును అందించింది. కజకిస్తాన్‌, వెనిజులా దేశాలు తమ దేశాల అత్యున్నత పురస్కారాలు ప్రదానం చేశాయి. మొరాకో దేశం 'మానవ హక్కులను పరిరక్షించిన వ్యక్తిగా సత్కరించి, సాంస్కృతిక మానవీయ రంగాలలో సృజనశీలునిగా అభివర్ణించి 'మొరాకన్‌ స్టార్‌' అనే ప్రతిష్టాత్మక పౌర పురస్కారంతో సత్కరించింది. దాదాపు అన్ని అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌ నుంచి నరసింగరావుకు ప్రత్యేక ప్రశంసలు లభించాయి. తెలుగు సినిమా వజ్రోత్సవాల సందర్భంగా 2007 వ సంవత్సరంలో నరసింగరావును సినీపరిశ్రమ ఎక్సలెన్స్‌ అవార్డు' ను బహూకరించింది. నిరంతర నిబద్ధతతో ప్రజ్ఞతో భారతీయ చిత్ర రంగానికి వన్నె తెచ్చిన వ్యక్తిగా ఇండీవుడ్‌ ఎక్సలెన్స్‌ అవార్డులను ఎంపిక చేసే భారతీయ చిత్ర పరిశ్రమ 'లైఫ్‌ టైం ఎచీవ్మెంట్‌ అవార్డు - 2017' అందచేసింది. 1989లో మ్యూనిచ్‌, 1990 లో జెకోస్లోవేకియా, 1989, 91 లలో మాస్కో, 1991, 92లలో ఫెస్టివల్‌ అఫ్‌ ఇండియా ఇన్‌ బెర్లిన్‌, 1994లో బెర్గామో (ఇటలీ), 1999లో బుడాపెస్ట్‌, 2004లో కైరో వంటి వివిధ ఫిలిం ఫెస్టివల్స్‌ లలో తన చిత్రాల ద్వారా భారత దేశానికి గుర్తింపును తెచ్చిన ఆహ్వానిత ప్రతినిధిగా బి. నర సింగరావు పాల్గొన్నారు. ఫ్రాన్స్‌, స్లొవే కియా, స్విట్జర్లాండ్‌, కెనడా, స్వీడన్‌, ఐర్లాండ్‌, ఇజ్రాయిల్‌, ఇరాక్‌, జర్మనీ, ఇటలీ, రష్యా, ఇరాన్‌, బాంగ్లాదేశ్‌లలో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌ లలో ఆయన చిత్రాలు ప్రదర్శించారు.

-పొన్నం రవిచంద్ర, 9440077499

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చల్లకోసం వచ్చి ముంత దాచినట్లు
తెలుగు కార్టూన్‌కు పూర్వ వైభవం రావాలి
విషాదాంత ప్రేమ‌క‌థా చిత్రం ‘మ‌రో చ‌రిత్ర‌’
పిడుగుపాటుకు తీసుకోవలసిన జాగ్రత్తలు
జిపి బిర్లా గ్రంధాలయం
డీ హైడ్రేషన్‌, సన్‌స్ట్రోక్‌
అమృతంలాంటి కుండ నీరు
పాలెం కళ్యాణసుందరం దాతృత్వం
స్వలింగ వివాహాల చట్టబద్దత సాధ్యమేనా?
కాపర్‌ వైర్‌తో కళాకృతులు
మార్గమధ్య ఎలిఫంటా గుహలు
వేడి నీటిని తాగితే ఏమవుతుంది?
మదర్‌ ఇండియా నర్గీస్‌ దత్‌
సుందరయ్య జన్మదినం, భారతావనికే పర్వదినం
ఉద్యోగస్తుల పనివేళల్లో తీసుకోవాల్సిన ఆహార నియమాలు
యాత్రా స్పెషల్‌
చారిత్రక కట్టడాలు
అనిర్వచనీయ అనుభూతిని పంచే ఎమ్వీ రామిరెడ్డి కవిత్వం
తల్లిదండ్రులకు లేఖ
వాసు మారాడు
బాలల చెలికాడు 'అవధాన పద్యాల బండి' బండికాడి అంజయ్య గౌడు
హిందీ తెరపై మధురగీతాల 'బర్సాత్‌' శంకర్‌ సింగ్‌ రఘువంశీ
జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటుకు అడ్డుకట్ట..!
చరిత్ర తిరగ రాసిన గుడిమల్లన్న
ఉన్నప్పుడు ఉరుకులాట ఎక్కువ, లేనప్పుడు వెంకులాటలు ఎక్కువ
మన చారిత్రక వారసత్వ సంపద
కెరమెరి మండలంలోని అడవులలో కొత్త కాలమ్నార్‌ బసాల్ట్స్‌
ఆర్గానిక్‌ కొర్రలు (ఫింగర్‌ మిల్లెట్స్‌ / ఫాక్స్‌టెయిల్‌ మిల్లెట్స్‌
తెలుగు నాటక విద్యాలయం అవశ్యం
భూమిని కాపాడుకుందాం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.