Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పుత్రశోకాన్ని ఆజన్మాంతం మోస్తూ జీవించే హార్మోని 'హాన్దుక్‌' | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Jan 08,2023

పుత్రశోకాన్ని ఆజన్మాంతం మోస్తూ జీవించే హార్మోని 'హాన్దుక్‌'

         భారతీయ సినిమాపై హాలివుడ్‌ ప్రభావం చాలా ఉంది. ఒక రిత్విక్‌ ఘటక్‌ తప్ప పూర్తి భారతీయ ఆత్మతో సినిమాను తీసిన దర్శకులు మన దగ్గర ఇంచుమించు లేరనే సినీ విశ్లేషకుల అభిప్రాయం. ఈ మధ్య అసామీ భాషలో వస్తున్న సినిమాలు ఆ కొరతను తీరుస్తాయని అనిపిస్తుంది. సినిమా అంటే కనిపించే దృశ్యాలు, పాత్రల నడుమ నడిచే సంభాషణలు మాత్రమే కాదని వీటితోనే కాకుండా వీటి మధ్యన కూడా ప్రభావంతంగా కథను నడిపించవచ్చని తెలిసిన దర్శకులు అతి తక్కువ మంది. ఓ పాత్రని స్క్రీన్‌ పై చూపే విధానంలో, ఆ పాత్రతో నడిపించే అడుగులతో కూడా కథను చెప్పవచ్చు. దీన్ని నిజం చేసిన సినిమా అసామీ భాషలో వచ్చిన ''హాన్దుక్‌''. అసామీ ప్రాంతంలో మోరాన్‌ భాషలో హాన్దుక్‌ అంటే ఇంట్లోని ఓ చీకటి మూల. ఓ తల్లి మనసులోని ఓ చీకటి మూలను తాకే ప్రయత్నం చేసిన సినిమా ఇది.
ఈ సినిమాలో నటించిన వాళ్లు ఫ్రొఫెషనల్‌ నటులు కాదు. సినిమా మొదటి షాట్‌ లో ఓ పల్లెటూరి ముసలి స్త్రీ ఓ పెద్ద వెదురు చెట్టుని నరుకుతూ కనిపిస్తుంది. ఆ పెద్ద చెట్టుని నరికి తనతో పాటు లాక్కుంటూ తీసుకువెళుతుంది. ఈ షాట్‌ నిడివి సుమారు ఆరు నిముషాలు ఉంటుంది. కెమెరా అస్సలు కదలదు. ఈ ఒక్క షాట్‌తో సినిమా మూడ్‌ని చూపిస్తారు దర్శకులు. ఆ తల్లి జీవితంలో ఏ ఉత్సాహం లేదు, ఏ జీవం లేదు. కదులుతున్న ప్రాణం లేని శరీరం అది. ఆ తల్లి పాత్ర సినిమాలో ఒక్క మాట కూడా మాట్లాడదు. ఆమె జీవం లేని కళ్లు, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్లున్న ఆమె ముఖం, ఏ గమ్యం లేని ఆమె శరీర కదలికలు ఆమె జీవితంలోని విషాదాన్ని సూచిస్తుంటాయి.
ఆ స్త్రీ పేరు హర్మోని. ఆమె కొడుకు ముక్తి మిలిటెంట్లలో చేరి ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నాడు. అతను బతికి ఉన్నాడో లేదో కూడా ఆ తల్లికి ఏ సమాచారం లేదు. బుల్లెట్లు నిండిన ఓ శరీరాన్ని ఆమె కొడుకుదిగా నిర్ణయించడం వల్ల హార్మోని ఆ శరీరానికి అంతక్రియలు చేస్తుంది. తరువాత ఖర్మ కూడా నిర్వహిస్తుంది. కాని ఇంతలో ఆ శరీరం తన కొడుకుది కాదనే మరో అనుమానం మొదలవుతుంది. సెవాలి, ముక్తి బాల్య స్నేహితురాలు, ప్రియురాలు కూడా. ఆమె కూడా ముక్తి ఏదో ఓ రోజు తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ ఇద్దరు స్త్రీలకు జీవించడానికి మరో కారణం ఉండదు. కాని ముక్తి అంతక్రియలు, ఆ తరువాత వచ్చిన అనుమానంతో తమ మనసులను ఎలా సమాధాన పరుచుకోవాలో ఆ ఇద్దరికీ అర్థం కాదు. సినిమాలో ఈ పాత్రల పేర్ల ద్వారా కూడా దర్శకులు చాలా చెప్పే ప్రయత్నం చేశారు. ముక్తి బతికి ఉన్నాడో లేడో తెలీదు. ముక్తి అంటే స్వాతంత్య్రం, ఇది ఈ సమాజంలో ఉందో లేదో తెలియని పరిస్థితి.
అదే గ్రామంలో బిప్లబ్‌ అని ఇంకో యువకుడు ఉంటాడు. ఉద్యమబాటలో కొన్నాళ్లు ప్రయాణించి తరువాత ప్రభుత్వానికి లోంగిపోయి జనజీవన సవ్రంతిలో కలిసిపోతాడు. కాని ఆ ఉరిలో ఇదివరకులాగా జీవించలేక సతమతమవుతూ ఉంటాడు. విప్లవాన్ని వదిలి వచ్చిన వారిని తమ పిల్లలకు నమ్మక ద్రోహం చేసిన వారిగా విప్లవంలో పిల్లలు ఉన్న పెద్దలు చూస్తూ ఉంటారు. ఈ లొంగిపోయిన మిలిటెంట్‌కు బిప్లబ్‌ అన్న పేరు పెట్టడంతో విప్లవం లొంగిపోయి అయోమయపు స్థితికి చేరి నమ్మకం పోగొట్టుకున్న నైజం ప్రతిఫలిస్తుంది. ఈ పాత్రకు ఈ పేరు పెట్టి దర్శకులు ప్రస్తుతం విప్లవ స్థితిని చూపించే ప్రయత్నం చేసారనిపిస్తుంది.
ఒక్క మాట మాట్లాడని ఆ తల్లి సినిమాలో ఎక్కడా కూడా ఓ కన్నీటి బొట్టు రాల్చదు. కాని ఆమె ప్రతి కదలికలో ఆమె జీవితంలోని విషాదం కనిపిస్తూ ఉంటుంది. కొడుకు అంతక్రియలు చేసాక అతను కొడుకు కాదని తెలిసినప్పుడు అతని క్షేమాన్ని కాంక్షిస్తూ ఆమె తరువాత ఊరిలోని స్త్రీలందరితో పాటు మరో పూజ నిర్వహిస్తుంది. రెండు సందర్భాలలో కూడా అదే విషాదం ఆమె ముఖం పైన, అదే నిర్వేదం కనిపించి ప్రేక్షకులకు ఓ రకమైన భయం కలుగుతుంది.
సినిమాను ఎటువంటి ఆర్భాటాలు, గోల లేకుండా నడిపిస్తారు దర్శకులు జైచంగ్‌ జై దొహోటియా. ఈశాన్య ప్రాంతాలలోని మిలిటెంట్లకు ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటాన్ని కథా వస్తువుగా తీసుకునున్నా, ఎక్కడా యుద్ధ చాయలు, గన్‌ షాట్లు ఈ సినిమాలో కనిపించవు. ఆ పోరాట పరిస్థితుల కారణంగా ఓ చిన్న మారుమూల పల్లెటూరిలో జీవం కోల్పోయి జీవిస్తున్న సగటు స్త్రీలను చూపించడం మాత్రమే అతని ఉద్దేశం. కొడుకు ఉన్నాడో, లేడో తెలీదు, పోయాడని అతని కోసం ఏడవాలో తెలీదు. అసలు ఆ కొడుకుది అనుకున్న శవం అతనిదా కాదా అన్న మీమాంస. మళ్లీ అతని క్షేమం కోసం చేసే ప్రార్ధనలో కూడా ఓ అనుమానం. దేన్ని నమ్మాలో నమ్మకూడదో, ఏది నిజమో అబద్దమో అర్ధం కాని అయోమయంలో ఓ తల్లి పడే వేదన ఈ సినిమా అంతా ఆక్రమించుకుని ఉంటుంది. అలాగే తాను ప్రేమించిన వ్యక్తి కోసం ఎదురు చూడాలో లేదో తెలియని అయోమయంలో భవిష్యత్తు లేని జీవితాన్ని లాక్కు వచ్చే మరో యువతి ఒంటరితనాన్ని కూడా చూపిస్తుంది ఈ సినిమా.
ఈశాన్య ప్రాంతాలలో మారుమూల పల్లెటూర్లలో ఇంకా రోడ్లు కరెంటూ లేని ఓ చిన్న ఊరులో ఈ కథను నడిపిస్తూ అక్కడి ప్రకృతిలో మమేకమైన విషాదాన్ని కూడా పట్టుకుంటారు దర్శకులు. సినిమా అంతా కూడా సహజమైన వెలుతురులోనే తీసారు. గాలి చేస్తున్న చప్పుడు, ఆకుల రాపిడి, అడుగుల చప్పుడు కూడా వినిపించే అంత గొప్పగా సినిమాటోగ్రఫీ, సౌండ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. నీళ్ళల్లో కనిపించే నాచు నుంచి ఏపుగా పెరిగిన వృక్షాల దాకా అంతా పచ్చదనమే కాని వాటిలో కూడా విషాదం పరుచుకుని కనిపిస్తుంది. చివరికి శవానికి కప్పి ఉన్న ప్లాస్టిక్‌ షీట్‌ కూడా పచ్చగా భయం గొల్పేలా ఉంటుంది. ఇంట్లో వెలిగే గుడ్డి దీపం కూడా చావును గుర్తుకు తెస్తూ, శవం వెనుక పెట్టిన దీపంలా అనిపిస్తూ ఉంటుంది. సినిమా చివర్లో బిప్లబ్‌ తన పరపతి ఉపయోగించి ముక్తి గురించి కనుక్కుంటాడు. జవాబుగా అతనికి మిలిటెంట్‌ స్నేహితుల నుండి ఓ ఉత్తరం వస్తుంది. అది అతను తెరవడు. దాన్ని హర్మోని ఇంటి బైట వదిలి వేస్తాడు. ముక్తి బతికి ఉన్నాడో లేదో ప్రేక్షకులకు తెలియదు. ఆ తల్లి మళ్లీ దేనికి సిద్ధపడాలో దర్శకులు చెప్పరు. ఇంత దాకా వచ్చాక అది తెలుసుకోవడం అవసరం అనిపించదు. ముక్తి లోటుతో ఆ తల్లి అనుభవిస్తున్న విషాదం కన్నా మరో పెద్ద విషాదం ఉండదని, ముక్తి బతికి ఉన్నాడా లేదా అన్నది ఆ సందర్భంలో అప్రస్తుతం అని ప్రేక్షకులకూ అనిపిస్తుంది. ఆ తల్లి ఏ ఆనందాలకూ, విషాదాలకూ స్పందించని స్థితిలో గడుపుతున్న జీవితంలో ఎటువంటి వార్త అయినా పెద్ద తేడా తీసుకురాదు. ఏ స్పందనలూ మనసుకు అంటని స్థితికి చేరుకోవడం కన్నా మనిషి జీవితంలో మరో విషాదం ఏం ఉంటుంది. దేశ రాజకీయ, సామాజిక, ఆర్ధిక పరిస్థితులు ఎందరి తల్లులను ఈ స్థితిలోకి నెట్టివేస్తున్నాయో అన్నది ఆలొచిస్తే, మనసు భారం అయిపోతుంది.
సినిమాని టిక్నికల్‌గా విశ్లేషించే వారు ఇందులో ఉపయోగించిన ఫోర్‌ గ్రౌండ్‌ షాట్ల గురించి చర్చిస్తారు. కెమెరాకు అతి దగ్గరగా ఉన్న వస్తువు మీదనే పూర్తి దృష్టితో తీసే ఈ షాట్లు సాధారణంగా సినిమాలకు వాడరు. కాని ఈ సినిమా అధికశాతం ఫోర్‌ గ్రౌండ్‌ షాట్లలోనే తీయడం వేశేషం. హింసను స్క్రీన్‌పై చూపకుండా, సినిమా కథ అంతా కూడా హింసను ప్రస్తావించడం మరో విశేషం. ఈ సినిమాను, ఇటువంటి వాతావరణంలో జీవిస్తూ ఆ హింసను ప్రతి నిత్యం అనుభవిస్తున్న వారి మధ్య, వారితోనె తీయడం మరో విశేషం. అసాం ప్రాంతాలలో మోరాన్‌ భాష మాట్లాడే వారిపై ఇప్పటి దాకా ఏ చిత్రమూ రాలేదట. పైగా అదే భాషలో సినిమా రావడం కూడా ఇదే మొదటి సారి. అంతే కాకుండా సినిమాలో చూపించిన ఖర్మకాండలు, పూజలు, అన్నీ కూడా అక్కడి ప్రజల జీవితంలోని నిజాలు. వాటిని పూర్తిగా యధావిధిగా చిత్రీకరించి ఆ ప్రాంతపు సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే ప్రయత్నం చేసారు దర్శకులు. సినిమాలోని ఆ తల్లి పాత్ర విషాదం మాత్రం మనలను చాలా రోజులు వేధిస్తుంది.

- పి.జ్యోతి
  9885384740

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చల్లకోసం వచ్చి ముంత దాచినట్లు
తెలుగు కార్టూన్‌కు పూర్వ వైభవం రావాలి
విషాదాంత ప్రేమ‌క‌థా చిత్రం ‘మ‌రో చ‌రిత్ర‌’
పిడుగుపాటుకు తీసుకోవలసిన జాగ్రత్తలు
జిపి బిర్లా గ్రంధాలయం
డీ హైడ్రేషన్‌, సన్‌స్ట్రోక్‌
అమృతంలాంటి కుండ నీరు
పాలెం కళ్యాణసుందరం దాతృత్వం
స్వలింగ వివాహాల చట్టబద్దత సాధ్యమేనా?
కాపర్‌ వైర్‌తో కళాకృతులు
మార్గమధ్య ఎలిఫంటా గుహలు
వేడి నీటిని తాగితే ఏమవుతుంది?
మదర్‌ ఇండియా నర్గీస్‌ దత్‌
సుందరయ్య జన్మదినం, భారతావనికే పర్వదినం
ఉద్యోగస్తుల పనివేళల్లో తీసుకోవాల్సిన ఆహార నియమాలు
యాత్రా స్పెషల్‌
చారిత్రక కట్టడాలు
అనిర్వచనీయ అనుభూతిని పంచే ఎమ్వీ రామిరెడ్డి కవిత్వం
తల్లిదండ్రులకు లేఖ
వాసు మారాడు
బాలల చెలికాడు 'అవధాన పద్యాల బండి' బండికాడి అంజయ్య గౌడు
హిందీ తెరపై మధురగీతాల 'బర్సాత్‌' శంకర్‌ సింగ్‌ రఘువంశీ
జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటుకు అడ్డుకట్ట..!
చరిత్ర తిరగ రాసిన గుడిమల్లన్న
ఉన్నప్పుడు ఉరుకులాట ఎక్కువ, లేనప్పుడు వెంకులాటలు ఎక్కువ
మన చారిత్రక వారసత్వ సంపద
కెరమెరి మండలంలోని అడవులలో కొత్త కాలమ్నార్‌ బసాల్ట్స్‌
ఆర్గానిక్‌ కొర్రలు (ఫింగర్‌ మిల్లెట్స్‌ / ఫాక్స్‌టెయిల్‌ మిల్లెట్స్‌
తెలుగు నాటక విద్యాలయం అవశ్యం
భూమిని కాపాడుకుందాం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.