Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ల‌త్కోర్ సాబ్‌ | సోపతి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • స్టోరి
  • Jan 29,2023

ల‌త్కోర్ సాబ్‌

పాడె
దాన్ని మోస్తున్న నలుగురు.
దాని ముందు డప్పులూ, డాన్సులూ
దాన్ని పట్టుకుని ఒకడు
వాడి మెడలో పూలదండ
పాడె వెనుక ఒకడి చేతిలో చిన్న బుట్ట
దానిలో శవం మీద జల్లే మరమరాలూ, పూలూ, చిల్లర నాణేలూ
పాడె వెనక ఆడా, మగా
వారిలో కొందరి ఆడవాళ్ల ఏడ్పులు
ఇలాంటి శవయాత్ర సజీవదృశ్యం పేనయ్య కంట్లో ఓట్ల పంట పండించింది. గబగబా వెళ్లి పాడె మోస్తున్న నలుగురిలో ముందున్న ఒకణ్ని అతడు తప్పించాడు. వాడి స్థానంలో తాను భుజంపై పాడెనెత్తుకున్నాడు. పాడె మోస్తూ శ్మశానం దాకా వెళ్లాడు.
సాయంత్రం. రోడ్లు రద్దీగా ఉన్నాయి. ప్యాంటూ, షర్టూ వేసుకుని పేనయ్య బయల్దేరాడు. షరామామూలే అతని వెంట చెంచాలు. అతనో సెలూన్‌లో దూరాడు. సరిగ్గా అప్పుడే కటింగ్‌ చేసుకోవడానికి ఓ కుర్రాడొచ్చాడు. వాణ్ని అద్దం ముందున్న కుర్చీలో అతను కూర్చోబెట్టాడు. కత్తెర తీసుకున్నాడు. ప్రతిపక్షాల ఆరోపణల్ని కత్తిరించినట్లు వాడి జుత్తును అడ్డదిడ్డంగా మా చెడ్డగా కత్తిరించాడు. ఇతగాడు వెళ్లాక వాడు మనసారా, తనివితీరా, నోరారా, కసిదీరా, బూతులు తిడుతూ గుండు కొట్టించుకున్నాడు.
సెలూన్‌కు కొద్దిదూరంలో ఉన్న మిర్చి బండి దగ్గరకెళ్లాడు పేనయ్య. నూనెలో పకోడీలు వేయించాడు. వేయిస్తూ జెనాలను ఓట్లడిగాడు. దాంతో పకోడీలు కాస్తా అమావాస్య రాత్రులయ్యాయి.
ఇలా రోజుకొకడు తగలడితే నా వ్యాపారం దెబ్బతింటుంది దేవుడో అంటూ మిర్చి బండివాడు మొత్తుకున్నాడు.
ఆ రోజు ఆదివారం. రోజూలాగే ఆ రోజు పేనయ్య బొట్టు పెట్టుకోలేదు. పైగా మెడలోని రుద్రాక్ష మాల తీసేసాడు. దాని స్థానంలో శిలువ వేసుకున్నాడు. బైబిల్‌ చేత పట్టుకున్నాడు. చర్చికెళ్లాడు. ప్రార్థన చేశాడు. దర్గాకెళ్లి చాదర్‌ ఇచ్చాడు. ఏ మతానికి ఆ మతం వాడుగా మాట తీరు చూపెట్టాడు.
ఆఖరికి పేనయ్య చిన్నపిల్లల్ని కూడా వదల్లేదు. వాళ్లకు బిస్కెట్‌ పుడాలూ, చాక్లెట్లూ కొనిచ్చాడు. పేనయ్యకే మీ ఓటు, బొచ్చె గుర్తుకే మీ ఓటు అని అరుస్తూ వీధుల్లో తిరగమన్నాడు. పిల్లలకు రాజకీయాలేం తెలుసు. వారు అతను చెప్పినట్లే చేసారు. అతని భార్య కూడా తోచిన ప్రచారం చేసింది. ఇల్లిల్లూ తిరిగింది. ఆడవాళ్లకు బొట్టు పెట్టింది. రవికె బట్టతో పాటు భరిణలిచ్చి ఓట్లు అడిగింది.
చెప్పడం మరిచాను ఓ పొద్దున్న మన బొచ్చె పార్టీ నాయకుడు ఓ గుడిసె దగ్గరికి వెళ్లాడు. గుడిసె ముందు నులక మంచముంది. ఆ నులక మంచంలో ఓ ముసలాడు కూర్చుని చుట్ట తాగుతున్నాడు. సీదా అతని కాళ్లమీద పడ్డాడు.
'ఎవలూ' అని అతనడిగాడు.
'నేనే తాతా! బాగున్నావా?'
'బాగున్న. ఏం గావాలె'
'మీ ఓట్లన్నీ నాకే వెయ్లాలి'
జవాబు కోసం ఎదురు చూడకుండా పేనయ్య ఆ గుడిసెలోకి వెళ్లాడు. చంటివాడి ముడ్డి కడిగాడు. అతికష్టం మీద గంజి తాగాడు. వాళ్ల మంచి చెడ్డలు విచారించాడు.
పోలింగ్‌ ముందు రోజు జెనాలకు అతను డబ్బులు పంచాడు. మందు బాటిళ్లిచ్చాడు. ఓటర్లను పోలిగ్‌ బూత్‌ వరకూ తీసుకెళ్లడానికి ఆటోలనూ, ట్యాక్సీలనూ పెట్టాడు.
ఒక్క పేనయ్యే కాదు, ఎన్నికల్లో నిలుచున్న వాళ్లందరూ దాదాపు ఇలాగే ప్రచారం చేసారు.
పథకమే కానీయండి. పాదయాత్రే కానీయండి. ఎన్నికల ప్రచారమే కానీయండి. అక్కడి నుంచే మహామంత్రి లత్కోర్‌ మొదలు పెడతాడు. చిక్కలూరు అతనికి అచ్చొచ్చిన ఊరు. ఆ ఊరు నుంచే ప్రచారం మొదలు పెడితే అమాంతంగా గెలుపు దండ తన మెడలో పడటం గేరంటీ అనే అనుకునే వాడు.
ఆ రోజు చిక్కులూరులో పండగలాగ ఎక్కడ చూసినా బొచ్చెపార్టీ జెండాలే. ఏ వీధికెళ్లినా బొచ్చె గుర్తుతో ఉన్న తోరణాలే. ఏ చౌరస్తాలో చూసినా లత్కోర్‌ కటౌట్లే. మైదానాల్లో పార్క్‌ చేసిన లారీలే. ఏ హోటల్‌కెళ్లినా ఆ లారీల్లో వచ్చిన జెనాలే. ఎక్కడ చూసినా చుట్టలూ, బీడీలూ, సిగరెట్ల పొగలే. ఏ నోట చూసినా జర్దాపాన్‌లే. రకరకాల గుట్కాలే.
జెనాలు వాళ్లంతట వాళ్లు రాలేదు. అవిచ్చీ ఇవిచ్చీ డబ్బులిచ్చీ చుట్టుపక్కల ఊళ్ల జెనాలను బొచ్చెపార్టీ నాయకులే లారీల్లో తీసుకొచ్చారు. లక్షమంది పట్టే మైదానంలో వాస్తు ప్రకారం వేదిక ఏర్పాటు చేసారు. బూటకానంద స్వామి పెట్టిన ముహూర్తానికి ఒక్క నిమిషం అటూ ఇటూ తేడా లేకుండా మాటల వల తీసుకుని ఓట్ల వేటకు మహామంత్రి లత్కోర్‌ మైదానంలోకి వచ్చాడు.
'లత్కోర్‌ సాబ్‌ జిందాబాద్‌' అంటూ జెనాలు నినాదాలు చేస్తుండగా అతను వేదికనెక్కాడు.
'అమ్మలారా! అయ్యలారా! అక్కలారా! అన్నలారా! అందరికీ పాదాభివందనాలు. ఇది సముద్రమా? సమక్క, సారలమ్మ జాతరా! కాదు కాదు నా ప్రియమైన జెనమే. ఎప్పుడూ నా ధ్యాస మీ మీదే.
నాకు మోట కొట్టడం తెలుసు. మట్టి బాటలో తిరగడం తెలుసు. మేము మళ్లీ అధికారంలోకి వస్తే మీ చిన్న పిల్లల ముక్కు తుడవడానికి ఉచితంగా దస్తీలిస్తాం. టూత్‌ బ్రష్‌లిస్తాం. మీ పళ్లను కూడా తోమి పెడతాం. ప్రతి వీధిలో బొచ్చె క్యాంటీన్లు పెట్టి మూడు రూపాయలకే సద్ది బువ్వ ఇస్తాం.
చిన్నప్పుడు నేను తెల్లవారు జామునే నిద్రలేచేవాణ్ని. పేపర్లు వేసేవాణ్ని. ఇప్పుడు కూడా తెల్లవారు జామునే లేస్తున్నాను.
మీ కోసం కష్టపడుతున్నాను. నేను కింది నుంచి వొచ్చిన వాణ్ని. మీ వాణ్ని...'
'బొచ్చెనేత జిందాబాద్‌. లత్కోర్‌ సాబ్‌ జిందాబాద్‌' అంటూ జెనం పెద్దగా అరిచారు.
వారి అరుపుకు బ్రేక్‌ పడగానే లత్కోర్‌ తన ఉపన్యాసాన్ని తిరిగి మొదలెట్టాడు.
'మళ్లీ నేను మహామంత్రినైతే ప్రతి జిల్లా కేంద్రంలో ఒక విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తాను' ఎలాంటి కుదుపుల్లేకుండా ఎంచక్కా మీరంతా విమానాల్లో తిరగొచ్చు. విమానాశ్రయాల వల్ల ఎందరికో ఉద్యోగాలొస్తాయి. హోటళ్లూ, దుకాణాలూ పెట్టుకోవడానికి అవకాశాలొస్తాయి.
మా పార్టీ అధికారంలోకి వస్తే ఉచితంగా గ్యాస్‌ స్టవ్‌ ఇస్తాం. మేమే వంట చేసి పెడతాం. ఉచితంగా చొక్కా, ప్యాంటూ, చీరా రవికా ఇస్తా. మీ బట్టలు మేమే ఉతుకుతాం. అందరికీ మేమే గుండుకొడతాం. నామాలూ పెడతాం. ముసలి వాళ్లకూ, వితంతువులకూ పెన్షన్‌లిస్తాం. నిరుద్యోగులకు తిండి పెడతాం. తాగడానికి మందు పోస్తాం. కాల్చుకోవడానికి సిగరెట్లిస్తాం. ఇళ్లు కట్టిస్తాం. మధ్యాహ్నం ఆఫీసుల్లో ఉద్యోగులు కునుకు తియ్యడానికి మెత్తటి పరుపులేస్తాం.
ప్రతిపక్షాలు ముఖ్యంగా పల్లేరుగాయాల పార్టీల నాయకుల మాటలు నమ్మకండి. వాళ్ల మాటలు నీటి బుడగలు. పాము పడగలు. వాళ్లు వట్టి దద్దమ్మలు. అది చేస్తాం, ఇది చేస్తాం అంటారే తప్ప ఏం చెయ్యరు. వాళ్లకు గంజాయి తోటలున్నాయి. స్మగ్లర్లతో సంబంధాలున్నాయి. మా పార్టీని ఆదరించండి. బొచ్చె గుర్తుకే ఓట్లేయండి. జై బొచ్చె.జైజై బొచ్చె' అంటూ లత్కోర్‌ స్పీచ్‌ కొట్టాడు.
సభకొచ్చిన జెనాలు చప్పట్లు కొట్టారు. లత్కోర్‌ జిందాబాద్‌ అంటూ పెద్దగా అరిచారు అని నిత్యానందుడు చెప్పాడు.
********
'ఈ లత్కోర్‌ పురాణం ఎప్పుడైపోతుంది' అని సందేహాల్రావు అడిగాడు.
'ఈ పురాణానికి అంతం లేదు. ఇది అనంతమైనది. ఒక లత్కోర్‌ పోతే మరో లత్కోర్‌ వస్తాడు. పిట్టకథతో మొదలెట్టిన ఈ పురాణాన్ని పిట్టకథతోనే ముగిస్తాను.
ఒక చిన్న పోరడు అసెంబ్లీ దగ్గర సైకిల్‌ పార్క్‌ జేసిండు. ఐస్‌ కోట్‌ కొనెతంద్కు నడ్సుకుంట బోతుంటే పోలీస్‌ కానిస్టేబుల్‌ గాన్ని ఆపి -
'గీ రోడ్డు గురించి నీకెర్కలేదా? ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఆకర్కి మహామంత్రి గూడ గీదారి మీద్కెల్లి బోతరు' అని అన్నడు.
'ఫికర్‌ జెయ్యకుండ్రి అంకుల్‌. నా సైకిల్‌క తాలమేసిన' అని గా పోరడు అన్నడు.
ఆ తీరుగా ఈ పురాణం కతలు కతలుగా పెరిగి జెనానికి కతలే గావాలన్నది నిజమయ్యే రోజులు దగ్గర పడుతున్నట్టే కనిపిస్తోంది. వినిపిస్తోంది. మైమరపిస్తోంది
ముగింపు

- తెలిదేవ‌ర భానుమూర్తి
  99591 50491

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చల్లకోసం వచ్చి ముంత దాచినట్లు
తెలుగు కార్టూన్‌కు పూర్వ వైభవం రావాలి
విషాదాంత ప్రేమ‌క‌థా చిత్రం ‘మ‌రో చ‌రిత్ర‌’
పిడుగుపాటుకు తీసుకోవలసిన జాగ్రత్తలు
జిపి బిర్లా గ్రంధాలయం
డీ హైడ్రేషన్‌, సన్‌స్ట్రోక్‌
అమృతంలాంటి కుండ నీరు
పాలెం కళ్యాణసుందరం దాతృత్వం
స్వలింగ వివాహాల చట్టబద్దత సాధ్యమేనా?
కాపర్‌ వైర్‌తో కళాకృతులు
మార్గమధ్య ఎలిఫంటా గుహలు
వేడి నీటిని తాగితే ఏమవుతుంది?
మదర్‌ ఇండియా నర్గీస్‌ దత్‌
సుందరయ్య జన్మదినం, భారతావనికే పర్వదినం
ఉద్యోగస్తుల పనివేళల్లో తీసుకోవాల్సిన ఆహార నియమాలు
యాత్రా స్పెషల్‌
చారిత్రక కట్టడాలు
అనిర్వచనీయ అనుభూతిని పంచే ఎమ్వీ రామిరెడ్డి కవిత్వం
తల్లిదండ్రులకు లేఖ
వాసు మారాడు
బాలల చెలికాడు 'అవధాన పద్యాల బండి' బండికాడి అంజయ్య గౌడు
హిందీ తెరపై మధురగీతాల 'బర్సాత్‌' శంకర్‌ సింగ్‌ రఘువంశీ
జీవనశైలి మార్పులతో అధిక రక్తపోటుకు అడ్డుకట్ట..!
చరిత్ర తిరగ రాసిన గుడిమల్లన్న
ఉన్నప్పుడు ఉరుకులాట ఎక్కువ, లేనప్పుడు వెంకులాటలు ఎక్కువ
మన చారిత్రక వారసత్వ సంపద
కెరమెరి మండలంలోని అడవులలో కొత్త కాలమ్నార్‌ బసాల్ట్స్‌
ఆర్గానిక్‌ కొర్రలు (ఫింగర్‌ మిల్లెట్స్‌ / ఫాక్స్‌టెయిల్‌ మిల్లెట్స్‌
తెలుగు నాటక విద్యాలయం అవశ్యం
భూమిని కాపాడుకుందాం

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.